• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరో కూర్చుంటే ఫుల్...

ఆ హీరో కూర్చుంటే ఫుల్ బాటిల్ లెగలిసిందేనట!

By - Tupaki Desk
Update: 2022-03-16 23:30 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ అనడం కంటే కూడా ఆయన అభిమానులు ఎక్కువగా మిస్టర్ పర్ఫెక్ట్‌ అమీర్ ఖాన్‌ అంటే ఇష్టపడుతారు. ఎందుకంటే ఆయన సినిమాల విషయంలో అయినా ఇతర విషయాల్లో అయినా అంత పర్ఫెక్ట్‌ గా ఉంటాడు అనేది చాలా మంది అభిప్రాయం. ఈమద్య కాలంలో పెళ్లిల విషయంలో మిస్టర్‌ పర్ఫెక్ట్‌ కాదేమో అనిపిస్తుంది అంటూ కొందరు చర్చించుకోవడం జరుగుతుంది.

ఆ విషయం పక్కన పెడితే అమీర్ ఖాన్ ఖచ్చితంగా మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటూ ఉంటారు. ఒక పని చేయాలని భావించిన సమయంలో పూర్తి పర్ఫెక్ట్‌ గా చేసే వరకు ఆయన వదిలి పెట్టడు అని అంటారు. అందుకే ఆయన్ను ఆ పేరుతో పిలుస్తారు అని ఆయన సన్నిహితులు మరియు స్నేహితులు అంటూ ఉంటారు.

తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో అమీర్ ఖాన్ మద్యం సేవించడం పై మాట్లాడాడు. ఒకానొక సమయంలో తాను తాగేవాడిని. ఒకసారి కూర్చుంటే ముందు ఉన్న బాటిల్ పూర్తి అయ్యే వరకు లేచే వాడిని కాదు. మందు తాగడం లో ఒక నియంత్రణ అనేది ఉండేది కాదు. దాంతో తాగిన సమయంలో విచ్చలవిడిగా తాగుతూనే ఉండేవాడిని. రెగ్యులర్ గా తాగకున్నా అప్పుడప్పుడు తాగినా కూడా కూర్చుంటే లేచేవాడిని కాదు.

తనలోని ఆ పద్దతి తనకే నచ్చలేదట. దాంతో అమీర్ ఖాన్ తన బ్యాడ్‌ అలవాటు అయిన మద్యం తాగడం ను వదిలేశాడు. దాంతో ఆయన ఇప్పుడు నిజంగా మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అయ్యాడు. మద్యం తాగక చాలా కాలం అయ్యిందని చెబుతున్న అమీర్ ఖాన్‌ సినిమాల్లో కూడా ఎక్కువగా మద్యం తాగినట్లుగా చూపించేందుకు ఆసక్తి చూపించడట. ఆయన మద్యం కు పూర్తిగా వ్యతిరేకిగా మారిపోయాను అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అమీర్ ఖాన్‌ సినిమాల విషయానికి వస్తే ఆయన గత సినిమా విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఆయన లాల్‌ సింగ్ చద్దా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరోనా వల్ల దాదాపుగా రెండేళ్ల ఆలస్యం తో ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదల కు సిద్దం అవుతోంది. లాల్ సింగ్‌ చద్దా లో మన క్యూట్‌ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.
Tags:    
  • aamir khan 
  • mr.perfect 
  • audience 
  • bollywod 
  • star actor 
  • about alcohol 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS