రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..!

Update: 2020-10-24 13:35 GMT
సీనియర్ హీరో రాజశేఖర్‌ కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాజశేఖర్‌ తో పాటు ఆయన సతీమణి జీవిత, ఇద్దరు కుమార్తెలు శివాత్మిక - శివానీలకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే కొన్ని రోజులకు జీవిత - శివాత్మిక శివానీలు కరోనా నుంచి బయటపడ్డప్పటికీ రాజశేఖర్ - జీవిత మాత్రం సిటీ న్యూరో సెంటర్‌ లో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి శివానీ ట్విటర్‌ లో స్పందిస్తూ.. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని వెల్లడించింది. 'సిటీ న్యూరో సెంటర్‌ వైద్య బృందం మా నాన్నని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం వైద్య చికిత్సకు స్పందిస్తూ నిలకడగా ఉంది. నాన్న కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు'' అని శివానీ ట్వీట్‌ చేశారు.

సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు కూడా రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌ పై రాజశేఖర్‌ కి చికిత్స అందిస్తున్నామని.. ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని బులెటిన్‌ లో వెల్లడించారు. ''కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌ లో చేరిన డాక్టర్‌ రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల బృందం నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తోంది. రాజశేఖర్‌ కూడా చికిత్సకు స్పందిస్తున్నారు. కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన జీవితా రాజశేఖర్‌ కోలుకున్నారు. ఈ రోజు ఆమెకు చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జ్ చేశాం'' అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వచ్చిన ఈ ప్రకటన చూసిన అభిమానులు.. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
Tags:    

Similar News