• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #BIGGBOSS5TELUGU లీక్‌ :...

#BIGGBOSS5TELUGU లీక్‌ : ఈవారం ఎలిమినేషన్‌ లహరి

By - Tupaki Desk
Update: 2021-09-26 03:55 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం పూర్తి అయిన వెంటనే సరయు.. రెండవ వారం తర్వాత ఉమా దేవిలు ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారంలో అయిదుగురు ఎలిమినేషన్ కు నామినేట్‌ అయ్యారు. ప్రియాంక.. శ్రీరామ చంద్ర.. ప్రియా మరియు మానస్ లు ఎలిమినేషన్ నామినేషన్ లో ఉన్నారు. శనివారం ఎపిసోడ్‌ లో ప్రియాంక మరియు శ్రీరామ చంద్రలను నాగార్జున సేవ్‌ చేశారు. ఆది వారం ఎపిసోడ్‌ లో ముగ్గురిలో ఒకరిని ఇంటికి పంపించబోతున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అయ్యింది కనుక లహరి ని బయటకు పంపించబోతున్నారు అంటూ లీక్ వచ్చింది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా లీక్ బయటకు రావడంతో లహరి ఎలిమినేట్‌ అవ్వబోతుంది అంటూ తేలిపోయింది. లహరి మరియు ప్రియాల మద్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. లహరి కంటే ప్రియా కు ఇండస్ట్రీలో సీనియార్టీ ఎక్కువ మరియు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఎక్కువ కనుక ప్రియా సేవ్‌ అయ్యింది.. లహరి మాత్రం ఎలిమినేట్ అయ్యింది.

లహరి మొదటి నుండి కాస్త తేడా పర్సన్ అన్నట్లుగా ప్రేక్షకుల్లో ముద్ర పడిపోయింది. చూడ్డానికి అందంగా కనిపించిన లహరి ఏదైనా సందర్బంలో ఆమెలో అర్జున్ రెడ్డి బయటకు వస్తున్నాడు. ఆమె కొన్ని సార్లు చిన్న విషయాలకు కూడా చాలా హైపర్ అవుతోంది. మొదటి వారంలోనే ఆమె చాలా తన హైపర్ క్యారెక్టర్‌ ను చూపించింది. చిన్న చిన్న విషయాలకు ఆ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు వల్ల ఆమె మాట తీరు వల్ల ఆమెను ప్రేక్షకులు అప్పటి నుండే పక్కకు పెట్టడం జరిగింది. ఈసారి ఎలిమినేషన్ కు నామినేట్‌ అయిన సమయంలో ఆమెను ఓట్లు వేయకుండా జనాలు పక్కకు పెట్టినట్లుగా అనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో లహరి కోసం పెద్ద ఎత్తున క్యాపెంయిన్‌ నిర్వహించారు. సెలబ్రెటీలతో లహరికి ఓట్లు వేయమని చెప్పించడం మొదలుకుని అన్ని ప్లాట్‌ ఫామ్స్ మీద కూడా లహరిని జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలను ఆమె పీఆర్‌ టీమ్ ప్రయత్నించింది. కాని ఆమెకు ముందుగా గుర్తింపు లేకపోవడంతో పాటు ఆమె అప్పుడప్పుడు అర్జున్ రెడ్డిగా వ్యవహరిస్తున్న కారణంగా కూడా ఆమెను జనాలు లైట్ తీసుకున్నారు అనిపిస్తుంది.

ఎలిమినేషన్ కు నామినేషన్స్ జరిగిన సమయంలో కూడా లహరి హైపర్‌ అయ్యింది. ప్రియా ఒక విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించిన సమయంలో దాన్ని సరిగా వినిపించుకోకుండా చాలా రూడ్ గా ప్రవర్తించింది. ప్రియా ఉద్దేశ్యం ఏంటీ అనే విషయాన్ని పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. మరో వైపు ఆమె అమ్మాయిలతో కంటే అబ్బాయిలతో ఎక్కువగా ఉంటుంది అనే విషయం ప్రియా చెప్పడం వల్ల కూడా ప్రేక్షకుల్లో కాస్త ఇంపాక్ట్‌ అయ్యి ఉంటుంది. అందుకే ఆమెకు ఓట్లు వేసి ఉండక పోవచ్చు అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఆదివారం ఎపిసోడ్‌ లో లహరి ఎలిమినేట్‌ అయినట్లుగా చూపించబోతన్నారు. నాగార్జునతో స్టేజ్ పైకి వచ్చి లహరి ఏం మాట్లాడుతుందో చూడాలి. లహరి ఎలిమినేషన్ తో ఇంట్లో కంటెస్టెంట్స్ 16 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. లహరి ఎలిమినేట్ కాకుండా ఉండాల్సింది. ఆమె ఇంట్లో ఉంటే గ్లామర్ గా హౌస్ లో ఉంటుందని.. లోబో వంటి వారితో పాటు బయట ప్రేక్షకులు కూడా ఎంటర్‌ టైన్ అయ్యేవారు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ప్రియా తో పోటి పడి లహరి చివరకు ఎలిమినేట్ అయ్యి లహరి బయటకు వచ్చేసింది. ముందు ముందు ఆట ఎలా ఉంటుందో చూద్దాం.
Tags:    
  • Lahari 
  • Bigg Boss 5 
  • Nagarjuna 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS