కీర్తిని క్రాక్ గర్ల్ అన్న లేడీ ప్రొడ్యూసర్
‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటుంది. ఈమద్య థ్రూబ్యాక్ ఫొటోలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో కీర్తి ఈ ఫొటోను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫొటోలో కీర్తి సురేష్ కళ్లు పెద్దవి చేసి నవ్వుతూ ఎవరికో హాయ్ చెబుతున్నట్లుగా ఉంది. ఈ ఫొటోతో పాటు సప్నదత్ ను చూసిన సమయంలో నేను ఎంతగా ఎగ్జైట్ అయ్యానో చూడండి. నా చివరి చెల్లింపు వల్ల వచ్చిన ఆనందం ఇది అయ్యి ఉంటుందా అంటూ కీర్తి సురేష్ ఫన్నీగా కామెంట్ చేసింది.
మహానటి చిత్రంలో నటించిన సందర్బంలో ఆ సినిమా నిర్మాత అయిన స్వప్నదత్ తో కీర్తి సురేష్ కు మంచి స్నేహం అయ్యింది. వీరిద్దరు రెగ్యులర్ గా కలుసుకోవడం చాట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. నా చివరి చెల్లింపు వల్ల ఈ ఆనందం కలిగి ఉంటుందని కీర్తి సురేష్ చేసిన కామెంట్ కు నిర్మాత స్వప్న దత్ ఫన్నీగా స్పందించింది. ఈ క్రాక్ పిల్ల తన పారితోషికం కూడా అడగదు అంటూ ఫన్నీ ఈమోజీలు పోస్ట్ చేసింది.
వీరిద్దరి సరదా సంభాషణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్వప్నదత్ కామెంట్ ను బట్టి కీర్తి సురేష్ తన పారితోషికం విషయంలో చాలా లైట్ గా ఉంటుందని అనుకోవచ్చు. కొందరు హీరోయిన్స్ పారితోషికం విషయంలో నిర్మాతలను ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తారు. కాని కీర్తి సురేష్ పై నిర్మాత స్వప్న దత్ చేసిన వ్యాఖ్యలు ఆమె పద్దతిని తెలియజేస్తుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో బిజీ బిజీగా ఉంది.