స‌మంత‌కు షాక్ ఇచ్చిన కూక‌ట్ ప‌ల్లి కోర్టు!

Update: 2021-10-22 04:23 GMT
కొన్ని యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై స‌మంత ప‌రువు న‌ష్టం దావా కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. నాగ చైత‌న్య‌తో విడాకుల నేప‌థ్యంలో స‌ద‌రు యూ ట్యూబ్ ఛాన‌ల్స్ త‌న ప‌రువుకు భంగం క‌లిగించే క‌థ‌నాలు ప్ర‌సారం చేసాయ‌ని స‌మంత దావా వేసారు. తాజాగా ఈ కేసు విచార‌ణ లో స‌మంత‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ప‌రువు న‌ష్టం దావా వేసే బ‌దులు..వారి నుంచి క్ష‌మాప‌ణ‌లు అగ‌డొచ్చు క‌దా అని ట్విస్ట్ ఇచ్చింది. సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త వివ‌రాలు ప‌బ్లిక్ డొమైన్లో పెట్టేది వారే. ప‌రువుకు న‌ష్టం క‌లిగింది అనేది వారే క‌దా!! అని కోర్టు పేర్కొంది.

అయితే విడాకులు తీసుకోకుండానే స‌మంత జీవితం పై ఇష్టానుసారం అభ్యంత‌ర‌క వీడియోలు.. కించ‌ప‌రిచే వీడియోల‌తో మాన‌సిక ఇబ్బందుల‌కు గురిచేసార‌ని స‌మంత త‌రుపు న్యాయ‌వాది వాద‌నలు వినిపించారు. స‌మంత ప్ర‌తిష్టను కావాల‌నే కొంద‌రు భంగ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించార‌ని కోర్టుకు వివ‌రించారు. స‌మంత డ‌బ్బులు కోసం కేసు వేయ‌లేద‌ని..రాజ్యాంగం ప్ర‌కారం త‌నకు ద‌క్కాల్సిన‌ హ‌క్కుల్ని కాల‌రాస్తున్నాయ‌ని కేసు వేసిన‌ట్లు కోర్టుకు తెలిపారు. యూట్యూబ్ లో ఉన్న వీడియోలు డిలీట్ చేయ‌డంతో పాటు అన్కండీష‌న‌ల్ గా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని స‌మంత త‌రుపు న్యాయ‌వాది వాదించారు. భ‌విష్య‌త్ లో స‌మంత‌పై గానీ..ఆమె కుటుంబం పైగానీ ఎలాంటి దుష్ప్ర‌చారాలు చేయ‌కుండా అదేశాలు ఇవ్వాల‌ని కోర్టుని అభ్య‌ర్ధించారు.

అయితే తీర్పును నేటికి వాయిదా వేసారు. ఈరోజు మ‌ళ్లీ కేసు విచార‌ణ‌కు రానుంది. మ‌రి నేటి విచార‌ణ‌లో ఎలాంటి విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తాయో చూడాలి. నాగ‌చైత‌న్య తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు స‌మంత అధికారికంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆమెపై సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌నులు భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌ని టార్గెట్ చేస్తూ అస‌భ్య ప‌ద‌జాలంతో పోస్టులు పెట్టారు. విడాకులకు కార‌ణం స‌మంతనే అనే తీరుగా ఫోక‌స్ చేసి ప్ర‌చారం చేసారు. ఈ నేప‌థ్యంలో సామ్ కోర్టు మెట్లు ఎక్కిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News