గుండుకు ఆత్మీయ సహాయం

Update: 2018-01-08 11:48 GMT
ఒకప్పుడు కామెడీ ఆర్టిస్ట్ గా దివ్యంగా వెలిగిన గుండు హనుమంతరావు పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగాలేదు అనే సంగతి ఆ మధ్య ఒక టీవీ షోలో తానుగా చెప్పే దాకా బయటి ప్రపంచానికి తెలియలేదు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న గుండుకు చిరంజీవి లక్ష రూపాయల సాయం చేయటం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కాని గుండుకు ఉన్నది చిన్న సమస్య కాదు కాబట్టి వచ్చిన మొత్తం పూర్తి స్థాయిలో ఆయన ఖర్చులను భరించలేకపోయింది. ఇది కాస్త తెలంగాణా మంత్రి కేటిఅర్ దృష్టికి వెళ్ళడంతో ఆయన సత్వరం స్పందించి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఆ మేరకు ఒక సర్కులర్ కూడా విడుదల చేసారు. మీరు చూస్తున్న కాపీ కేటిఅర్ స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేసుకుంది.

అమృతం సీరియల్ ద్వారా బుల్లితెరపై కూడా తన హవా నడిపిన గుండు హనుమంతరావు అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ మొదలుకొని ఏ హీరో హాస్య చిత్రమైనా తప్పకుండా కనిపించేవాడు. పోటీ తీవ్రం కావడం, కొత్త తరం వచ్చేయడం అవకాశాలను బాగా దెబ్బ తీసాయి. దీనికి తోడు ఆరోగ్యం కూడా దెబ్బ తినడంతో గుండు బొత్తిగా బయట కూడా కనిపించడం మానేసారు. ఇప్పుడు మెల్లగా కోలుకుంటున్న గుండుకు 5 లక్షల సాయం చేయటం పట్ల కేటిఅర్ పై ప్రశంశలు కురుస్తున్నాయి. ఇలాంటి స్థితిలో పరిశ్రమలో ఇంకా చాలానే ఉండగా, కొందరు పరువు కోసం బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటే మరికొందరు సహాయం కోసం ఎదురు  చూస్తున్నారు. ఈ మధ్య మా చేపడుతున్న కార్యక్రమాలు, ఇలాంటి వారి స్థితిని బయటి ప్రపంచానికి చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ ఆసరా మరికొందరికి స్పూర్తిగా నిలవాలని కోరుకుందాం.
Tags:    

Similar News