భల్లాలదేవకు కెటిఆర్ స్పెషల్ సలహా!!

Update: 2016-10-10 10:18 GMT
ఇప్పుడు భల్లాలదేవ రానా దగ్గుబాటి.. ఎప్పుడెప్పుడు బాహుబలిః ది కంక్లూజన్ షూటింగ్ అయిపోతుందా అని చూస్తున్నట్లు ఉన్నాడు. ఎందుకంటే మనోడు ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే వెంటనే తదుపరి సినిమాల్లోకి దూకేస్తాడు మరి. పైగా ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోగా కనిపిస్తాడు కాబట్టి.. హైప్ ఇంకా ఎక్కువ ఉంటుంది.

అయితే త్వరలో తేజ డైరక్షన్లో రానా హీరోగా కాజల్ హీరోయిన్ గా చేయబోయే సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. స్వయంగా డాడ్ సురేష్‌ బాబు ఆ సినిమాను తీస్తున్నారు. అంటే తొలిసారిగా మనోడు డాడ్ ప్రొడక్షన్లో చేస్తున్నాడనమాట. అందుకే సురేష్‌ బాబుతో కలసి ఒక సెల్ఫీ దిగిన రానా.. ''ఈ ప్రొడ్యూసర్ గారితో మొదటిసారి పనిచేస్తున్నాను. ఆయన డాడ్ కూడా. త్వరలోనే ప్రాజెక్టు వివరాలు చెబుతాను'' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.టి.ఆర్ ''చిన్న సలహా అనుకో.. హెచ్చరిక అనుకో.. తండ్రులు అందరూ చాలా టఫ్‌ బాసులే.

నువ్వు జాగ్రత్తగా ఉండు'' అంటూ ఛమత్కరించారు. వెంటనే స్పందించిన రానా కూడా.. ''అలాగే సార్.. ఒప్పుకుంటున్నాను. అర్ధమైంది. ఫాలో అవుతాను'' అంటూ రిప్లయ్ ఇచ్చాడు. మంత్రి కెటిఆర్ టాలీవుడ్ తో భలే కెమిస్ర్టీతో మెయిన్టయిన్ చేస్తారులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News