కృతి కొత్త రొమాన్స్ అదిరిందిగా!!

Update: 2015-11-27 05:00 GMT
1నేనొక్క‌డినే - దోచెయ్ సినిమాల‌తో    చ‌క్క‌ని పెర్‌ ఫామ‌ర్‌ గా గుర్తింపు తెచ్చుకుంది కృతిస‌నోన్‌. ఆ రెండు సినిమాల త‌ర్వాత తెలుగు సినిమాల‌కు సంత‌కాలు చేసింది లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌ లో దిల్‌ వాలే చిత్రంలో వ‌రుణ్‌ ధావ‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది. షారూక్ ఖాన్ - కాజోల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో యంగ్ పెయిర్‌ గా ఈ జోడీ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ పీక్స్‌ లో చేస్తున్నారు.

ఇటీవ‌లే గెరువా.. అంటూ ఓ సాంగ్‌ ని రిలీజ్ చేశారు. లేటెస్టుగా  మ‌న్మా ఎమోష‌న్ జాగే అంటూ ఈ యువ‌జంట‌పై తెర‌కెక్కించిన సాంగ్ బిట్‌ ని నెట్‌ లో రిలీజ్ ఛేశారు. ఈ పాట వెరీ స్పెష‌ల్ .. థ్రిల్ క‌లిగించే స్టంట్స్ సాంగ్ మ‌ధ్య‌లో ఉంటాయి. ఖ‌రీతైన కార్ల‌తో డిఫ‌రెంట్ సెట‌ప్‌ లో యాక్ష‌న్ పాట మ‌ధ్య‌లో వ‌చ్చి వెళుతుంటుంది. ఫేమ‌స్ కొరియోగ్రాఫ‌ర్ రెమో డిసౌజా ఈ చిత్రానికి కొరియోగ్ర‌పీ చేశారు. ఈ పాట‌ను చాలా ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దారు. ఇక్క‌డున్న ఫోటోల్లో వ‌రుణ్‌ ధావ‌న్ - కృతిస‌నోన్ ల కెమిస్ర్టీ చూస్తుంటే ఫెంటాస్టిక్ అనిపించ‌డం లేదూ? ఈ ఇద్ద‌రి మ‌ధ్యా రొమాన్స్‌ ని ఓ రేంజులో తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ని అర్థం కావ‌డం లేదూ? ఒక‌వేళ దిల్‌ వాలే హిట్ట‌యితే ఆ త‌ర్వాత  కృతి బాలీవుడ్‌ లో టాప్ స్లాట్‌ లోకి వెళ్లిపోవ‌డం ఖాయం.
Tags:    

Similar News