చరణ్, మహేష్ అందంపై ఉప్పెన బ్యూటీ ఏమందంటే?

Update: 2022-07-05 15:30 GMT
ఉప్పెన సినిమాతో తెలుగుతరకు పరిచయమైన కృతి శెట్టి ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా గట్టిగానే వచ్చాయి.

ఇక డిమాండ్ ను బట్టి రెమ్యునరేషన్ కూడా ఒక్కసారిగా పెంచేసింది. కేవలం రెండవ సినిమాతోనే ఆమెకు కోటికి పైగా రెమ్యూనరేషన్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్రస్తుతం కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్న కృతి శెట్టి భవిష్యత్తులో అగ్ర హీరోలతో కూడా సినిమా చేయాలని గట్టిగానే ప్లాన్ చేసుకుంటూ ఉంది. ఇక ప్రస్తుతం ఆమె ది వారియర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ మాస్ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది.

తమిళ దర్శకుడు లింగస్వామి తెరకెక్కించిన ఈ యాక్షన్ కాప్ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనియ్ ఎంతో నమ్మకంగా ఉంది. ఇక కృతి శెట్టి కూడా ఒకవైపు తమిళంలోనే కాకుండా మరొకవైపు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తోంది. ఇంకా దర్శకుడు హీరో ఎవరు ప్రమోషన్స్ లోకి రాకపోయినప్పటికీ ఉప్పెన బ్యూటీ అప్పుడే హడావిడి మొదలుపెట్టేసింది.

ఇక రీసెంట్ గా ఆమె మహేష్ బాబు రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమైన హీరోలు అంటూ అందులో రామ్ చరణ్ సూపర్ క్యూట్ గా ఉంటాడు అని మహేష్ బాబు అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అని వివరణ ఇచ్చింది.

అంతే కాకుండా భవిష్యత్తులో ఆ హీరోలతో తప్పకుండా సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తనలోని కోరికను కూడా బయటపెట్టింది. ఇక ప్రస్తుతం కృతి అయితే మరొక రెండు సినిమాల్లో కూడా నటిస్తోంది. అలాగే ఒక అగ్ర హీరో సినిమాలో కూడా ఆమె అవకాశం అందుకునే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Tags:    

Similar News