క్రియేటివ్‌ డైరెక్టర్‌ మూవీ ఇంకా ఎన్నాళ్లు?

Update: 2020-12-14 07:00 GMT
క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రంగమార్తాండ. దాదాపుగా రెండేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు మీడియా సర్కిల్స్‌ లో వినిపిస్తున్నాయి. షూటింగ్‌ ఈ ఏడాది కరోనా కారణంగా ఇన్నాళ్లు జరగలేదు. ఇటీవలే మళ్లీ షూటింగ్‌ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రమ్యకృష్ణ పై దర్శకుడు కృష్ణవంశీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భార్య భర్తలు అయిన కృష్ణవంశీ మరియు రమ్యకృష్ణలు సుదీర్ఘ కాలం తర్వాత ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

ఈ సినిమాలో రమ్యకృష్ణ ను ఒక కళాకారిణిగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్‌ లో శివాత్మిక రాజశేఖర్‌ మరియు ఇతర ముఖ్య నటీనటులు కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాతో కృష్ణవంశీ తన మార్క్‌ ను చూపించి ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాహుల్‌ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. బ్రహ్మానందంను గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో చాలా సీరియస్‌ పాత్రలో కృష్ణవంశీ చూపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయితే వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాత అయినా విడుదల అవుతుందో చూడాలి.
Tags:    

Similar News