ఆ క్రియేటివ్ డైరెక్టర్ కి కొత్త కష్టాలు క్రియేట్ అవుతూనే ఉన్నాయట...!
కృష్ణవంశీ.. తెలుగు సినీ పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 'గులాబి' ‘నిన్నే పెళ్లాడుతా’ ‘సింధూరం’ ‘అంత:పురం’ 'మురారి' ‘ఖడ్గం’ 'డేంజర్' ‘రాఖీ’ 'చందమామ' వంటి మంచి సినిమాలతో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని అయితే కృష్ణవంశీ లిఖించుకోగలిగారు. తన కెరీర్లో చేసినవి 20 సినిమాలే అయినా తన ఖాతాలో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు.. నాలుగు నంది అవార్డులు.. మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వేసుకున్నారు కృష్ణవంశీ. క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న కృష్ణవంశీ గత కొంతకాలంగా బాగా వెనకబడిపోయారు. 'చందమామ' సినిమా తరవాత కృష్ణవంశీ ఆ స్థాయి హిట్టు అందుకోలేదు. ఆఖరికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసిన ఫ్యామిలీ డ్రామా 'గోవిందుడు అందరివాడేలే'ని కూడా ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు. ఇక యువ హీరోలతో చేసిన మల్టీస్టారర్ ‘నక్షత్రం’ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో ఒకానొక దశలో ఆయన క్రియేటివిటీ మీద ఆయనకే డౌట్ వచ్చినట్లుంది.. ఈసారి ఎలాగైనా 'రంగమార్తాండ' సినిమాతో హిట్టు కొట్టి ఫాంలోకి రావాలని కృష్ణవంశీ చూస్తున్నారు.
ఇదిలా ఉండగా పాపం కృష్ణవంశీకి ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు కలిసి రావడం లేదంట. దానికి ఎవరు మాత్రం ఏమి చేస్తారు. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. క్రేజ్ ఉంది కదా అని నిర్మాతల్ని పిండేస్తే చివరకు టాలెంట్ ఉన్నా.. ఇండస్ట్రీలో జరిగిన బ్యాడ్ ప్రచారం కారణంగా ఎక్కడికి వెళ్లినా తలుపు మూసేస్తారు. కృష్ణవంశీ మళ్లీ కమ్ బ్యాక్ అయ్యేందుకు 'అంత:పురం' మాదిరి స్టోరీ ఒకటి రెడీ చేసి నిర్మాతల కోసం తెగ ట్రై చేస్తున్నాడట. అయితే స్టార్లు ఎవ్వరు ఇప్పుడప్పుడే ఖాళీ లేకపోవడం.. ఒకవేళ ఖాళీ ఉన్నా మనోడుతో పని చేసేందుకు ముందుకు రావకపోవడంతో కృష్ణవంశీకి చుక్కలు కనిపిస్తున్నాయట. అంతేకాకుండా షట్ డౌన్ కి ముందు ఒక ఎన్నారై ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు రావడంతో.. హీరో కోసం వెతకడం స్టార్ట్ చేసిన కృష్ణవంశీకి తాజాగా మళ్లీ కష్టాలు మొదలైయ్యాయట. సదరు ఎన్నారై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇక్కడ హైదరాబాద్ లో ఓపెన్ చేసిన ఆఫీస్ ఉన్న పళాన క్లోజ్ చేసేసినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ఆఫీస్ లో ఉంటున్న లిమిటెడ్ స్టాఫ్ కి కూడా చెప్పేశారట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆర్డర్ కూడా ఇచ్చినట్లుగా తెలిసింది. ఇన్ని రోజులు మంచి ప్రొడ్యూసర్ దొరికాడని ఆశగా హీరో కోసం వేట మొదలు పెట్టిన కృష్ణవంశీకి ఇప్పుడు ఏమి చేయాలో తోచడం లేదు. మరి క్రియేటివ్ కృష్ణవంశీ నెక్ట్స్ స్టెప్ ఏంటో చూడాలి.