ఒకే సారి పవన్.. బాలయ్యలను డైరెక్ట్‌ చేయనున్న డైరెక్టర్‌

Update: 2021-10-07 02:30 GMT
పవన్‌ కళ్యాణ్ మరియు బాలకృష్ణ వంటి ఇద్దరు స్టార్‌ హీరోలను ఒకే సారి డైరెక్ట్‌ చేసే అవకాశం దర్శకుడు క్రిష్ కు వచ్చింది. అయితే పవన్‌ తో సినిమా చేయబోతున్న క్రిష్‌.. బాలయ్య తో మాత్రం ఆహా కోసం టాక్ షో ను చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ తో హరి హర వీరమల్లు సినిమాను ఇప్పటికే మొదలు పెట్టి సగం వరకు పూర్తి చేసిన క్రిష్‌ ప్రస్తుతం కొండ పొలం విడుదల పనుల్లో బిజీగా ఉన్నాడు. కొండ పొలం షూటింగ్‌ ను రెండు నెలల లోపులోనే ముగించిన క్రిష్ అద్బుతమైన ఔట్‌ పుట్‌ ఇచ్చాడనే టాక్ వస్తుంది. బాలయ్య వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా క్రిష్ దర్శకత్వంలో రూపొందింది. అంత భారీ సినిమాను కూడా క్రిష్ చాలా తక్కువ సమయంలోనే రూపొందించాడు. తనకు ఒక మెమరబుల్‌ సినిమాను ఇచ్చినందుకు గాను బాలయ్యకు క్రిష్‌ పై ప్రత్యేకమైన అభిమానం ఎప్పటికి ఉంటుంది. అందుకే క్రిష్‌ దర్శకత్వంలో టాక్ షో కు సిద్దం అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా కోసం బాలయ్య చేసే టాక్ షో చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ వస్తే వరుసగా సీజన్ లు చేయాలని కూడా భావిస్తున్నాడట. బాలయ్య ఇలాంటి షో లు అది కూడా ఓటీటీ కోసం చేయడం మొదటి సారి. ఈ షో పై నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు కూడా ఎదురు చూస్తున్నాడు అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ టాక్ షో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రెండు నుండి మూడు వారాల్లోనే మొదటి సీజన్ కు సంబంధించిన చిత్రీకరణ ముగించాలని భావిస్తున్నారు. మొదటి సీజన్ లో భాగంగా పది ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట.

క్రిష్‌ డైరెక్షన్‌ లో టాక్ షో అంటే ఆయన సినిమా ల మాదిరిగానే చాలా ప్రత్యేకంగా ఉంటాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు గతంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ టాక్‌ షో విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వైపు కొండపొలం రిలీజ్ పనులు చూస్తూనే మరో వైపు బాలయ్య టాక్ షో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తూనే ఇంకో వైపు హరి హర వీరమల్లు సినిమా తదుపరి షెడ్యూల్‌ కోసం భారీ సెట్టింగ్‌ ను వేయిస్తున్నాడట. ఒకే సారి మూడు ప్రాజెక్ట్ పనులతో క్రిష్‌ చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా పవన్‌ మరియు బాలయ్యల ప్రాజెక్ట్‌ లను ఒకే సారి డీల్‌ చేసిన.. చేస్తున్న.. చేయబోతున్న ఒకే ఒక్క దర్శకుడు క్రిష్‌ అనడంలో సందేహం లేదు. క్రిష్ అందరి వాడు అవ్వడం వల్లే ఇలా ఇద్దరు స్టార్ లతో ఒకే సారి వర్క్‌ చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News