క్రిష్ కోసం బాలీవుడ్ బడా స్టూడియోలు రెడీ
‘కంచె’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు క్రిష్. సినిమా చివరికి కమర్షియల్ గా ఎలాంటి ఫలితం చూసినా.. ఓ గొప్ప సినిమాగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోవడం మాత్రం ఖాయం. ఇలాంటి సినిమా తీశాక.. ఆటోమేటిగ్గా క్రిష్ తర్వాతి సినిమా మీద ఆసక్తి పెరగడం ఖాయం. మరి క్రిష్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాడు.. ఎవరిని హీరోగా పెట్టుకుంటాడు.. ఏ బేనర్లో సినిమా చేస్తాడు.. అన్న ఆసక్తి సహజం. ఈ ప్రశ్నే క్రిష్ ముందుంచితే.. తన తర్వాతి సినిమా బాలీవుడ్ నిర్మాణ సంస్థతో ఉండొచ్చన్న సంకేతాలు ఇచ్చాడు క్రిష్. అది తెలుగు సినిమానా, హిందీ సినిమానా అన్నది చెప్పలేదు కానీ.. తనకు బాలీవుడ్ కు చెందిన పెద్ద స్టూడియోలతో ఒప్పందాలున్నాయని చెప్పాడు.
‘‘ప్రస్తుతానికి కంచె విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. నా తర్వాతి సినిమాలకు సంబంధించి ఇంకకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఐతే బాలీవుడ్ లో కొన్ని పెద్ద స్టూడియోలతో ఒప్పందం కుదిరింది. కథల విషయంలో చర్చలు జరుగుతన్నాయి. అన్నీ సెట్టవగానే నా తర్వాతి ప్రాజెక్టుల గురించి ప్రకటిస్తా’’ అని చెప్పాడు క్రిష్. ‘కంచె’కు వస్తున్న రెస్పాన్స్ గురించి చెబుతూ... ‘‘నా కెరీర్ లో ఇంతవరకూ ఎప్పుడూ ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇన్ని ప్రశంసలు అందుకోలేదు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాఘవేంద్రరావు గారు సైతం ఫోన్ చేసి గొప్ప సినిమా తీశావని మెచ్చుకున్నారు. ఇంకా ఎంతోమంది సినీ ప్రముఖులు అభినందించారు. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకాన్ని కంచె రెట్టింపు చేసింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై చూపిస్తున్న అభిమానం చూస్తూంటే చాలా సంతోషంగా ఉంది’’ అని క్రిష్ చెప్పాడు.