మ‌హ‌మ్మారీ క‌ల్లోలంలోనూ చెప్పిన టైమ్ కి పూర్తి చేసిన మొన‌గాడు

Update: 2020-10-24 05:30 GMT
టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేయ‌గ‌లిగే మొన‌గాడిగా పూరి జ‌గ‌న్నాథ్ కి పేరుంది. ఆయ‌న శైలి స్పీడ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. సుకుమార్ కొర‌టాల రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కులు త‌మ సినిమాల్ని పూర్తి చేసేందుకు చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుంటే.. అందుకు భిన్నంగా పూరి జ‌గ‌న్నాథ్ చ‌క‌చ‌కా సినిమాలు తీసి రిలీజ్ చేసేస్తుంటారు. ఆయ‌న స్పీడ్ ఇస్మార్ట్ స్పీడ్ అని పొగిడేస్తుంటారు సాటి ద‌ర్శ‌కులు.

పూరి త‌ర్వాత మ‌ళ్లీ అంతే స్పీడ్ గా ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సినిమాలు తీసేది ఎవ‌రు? అంటే ఇప్పుడు మ‌రో కొత్త పేరు వినిపిస్తోంది. ద‌ర్శ‌కుడు క్రిష్ క్లాసీ చిత్రాల‌తో ఆకట్టుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఇంత‌కుముందు గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి లాంటి కాంప్లికేటెడ్ టాపిక్ ని హిస్టారిక‌ల్ క‌థాంశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించి అది కూడా ప‌రిమిత బ‌డ్జెట్ లో 80 రోజుల్లోనే సినిమా ని పూర్తి చేసి శ‌భాష్ అనిపించారు.

ఇప్పుడు అందులో స‌గం రోజుల్లోనే మొత్తం సినిమాని పూర్తి చేస్తూ క్రిష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు. ఓవైపు మహమ్మారి టాలీవుడ్ ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీల‌న్నీ సందిగ్ధావ‌స్త‌లో ఉన్నాయి. హీరోలు ఎవ‌రూ షూటింగుల‌కు వెళ్లేందుకు ఆస‌క్తిగా లేరు. ఇలాంటి క్లిష్ఠ‌మైన స‌న్నివేశంలో కూడా క్రిష్ ఏమాత్రం వెన‌క్కి జంక‌లేదు. వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో క్రిష్ త‌న చిత్రం షూటింగ్ పూర్తి చేసేసి షాకిచ్చారు. క్రిష్ కేవ‌లం 40 పని రోజుల్లో ముగించాలని అనుకున్నాడు. ముందే చెప్పిన‌ట్టే గడువులోగా పనిని పూర్తి చేసి చూపించాడు. మొత్తం టాకీ భాగం కేవలం 35 రోజుల్లో పూర్తి చేసేయ‌గా.. ఒక పాట మాత్రమే పెండింగ్. ఐదు రోజుల్లో దీని చిత్రీకరణ పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది. క‌థాంశం ప్ర‌కారం.. వికారాబాద్ అడ‌వుల్లో ఈ సినిమాని చిత్రీక‌రించారు. క్వాలిటీ ప‌రంగానూ ఎక్క‌డా రాజీకి రాకుండా ఈ మూవీని పూర్తి చేసార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News