గుమ్మడి కాయ కొట్టిన క్రాక్‌ పోలీస్‌ వచ్చేది ఎప్పుడో?

Update: 2020-11-11 15:30 GMT
రవితేజ హీరోగా శృతి హాసన్‌ హీరోయిన్‌ గా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'క్రాక్‌' సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. సమ్మర్‌ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించినా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఆమద్య షూటింగ్‌ పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవన్ని పుకార్లే అని దర్శకుడు తేల్చి చెప్పాడు. క్రాక్‌ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల అవుతుందని బల్ల గుద్ది మరీ చెప్పాడు. అన్నట్లుగానే థియేటర్లలోనే విడుదలకు సిద్దం చేస్తున్నారు.

క్రాక్‌ సినిమా షూటింగ్‌ బ్యాలన్స్‌ వర్క్‌ పూర్తి చేశారు. గత నెలలోనే పూర్తి చేయాల్సి ఉన్నా కూడా పర్ఫెక్షన్‌ కోసం కొన్ని సీన్స్‌ ను మరింత బెటర్‌ గా చిత్రీకరించేందుకు సమయం తీసుకున్నారట. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడంతో ఈ పోస్టర్‌ ను విడుదల చేసి షూటింగ్‌ కు గుమ్మడికాయ కొట్టేశాం అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి 2021 విడుదల అంటూ పోస్టర్‌ లో పేర్కొనడంతో జనవరిలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలోనే చాలా సినిమాలు విడుదలకు కాచుకు కూర్చున్నాయి. సినిమాల పోటీ విషయం పక్కన పెడితే అసలు అప్పటి వరకు థియేటర్లు పూర్తి స్తాయిలో ఓపెన్‌ అవుతాయా.. పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తాయా అనేది ఇంకా అనుమానంగానే ఉంది.
Tags:    

Similar News