కొరటాల హ్యాట్రిక్ సినిమా ఎవరితో?
శ్రీమంతుడు రికార్డులు తిరగరాస్తోంది. ఇది కొరటాల శివకు రెండో సినిమా. చావో రేవో తేల్చుకునే ఎటెప్ట్ అతడికి. అయితే శివ లోని మొండి పట్టుదల అంతిమంగా గెలిచింది. ఒక స్టార్ హీరో తో సినిమా ఓపెనింగ్ అయ్యి క్యాన్సిల్ అయ్యిందంటే అది ఆ దర్శకుడికి కొంత అవమానమే. అయినా స్పోర్టివ్ గా తీసుకుని ఆ తర్వాత కూడా ప్రిన్స్ మహేష్ కోసం చాలా కాలం వేచి చూసి చివరికి శ్రీమంతుడుని పట్టాలెక్కించి హిట్ కొట్టాడు. ద్వితీయ విఘ్నం అనే టాపిక్ ఎత్తకుండా ఘనవిజయం అందుకున్నాడు. శ్రీమంతుడు తర్వాత అతడు తెరకెక్కించబోయే హ్యాట్రిక్ చిత్రం ఏది? అన్న టాపిక్ వచ్చిందిప్పుడు.
వాస్తవానికి శ్రీమంతుడు కథ రాసుకుని రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని ప్రయత్నించాడు. చరణ్ తో ముహూర్త కార్యక్రమం చేసి కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటిస్తాడని అనుకున్నా ఎందుకనో వీలుపడలేదు. ఆ క్రమంలోనే ఆ కథని మహేష్ ఇమేజ్ కి తగ్గట్టు శ్రీమంతుడుగా మలిచాడని చెప్పుకున్నారు. ఏదేమైనా కొరటాల హిట్ కొట్టాడు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరు పిలిచి అవకాశం ఇస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాల్ని తెరకెక్కించే దర్శకుడిగా పేరొచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందరు హీరోల చూపు అతడిపైనే. కొరటాల ఎవరిని ఎంచుకుంటాడో వేచి చూడాల్సిందే.