కొరటాల వెనుకే ఎందుకు పడుతున్నారు?

Update: 2016-06-14 17:30 GMT
ఒక దర్శకుడు కంటిన్యూస్‌ గా హిట్టు కొడుతున్నాడంటే.. ఖచ్చితంగా నిర్మాతలందరూ అతని వెనుకే పడతారు. కాని దర్శకుడు కొరటాల శివ వెనుక మాత్రం.. నిర్మాతలు కాకుండా ఏకంగా డిస్ర్టిబ్యూటర్లు పడుతున్నారు.

మిర్చి సినిమాను నిర్మించింది ప్రభాస్‌ స్నేహితులే అయినప్పటికీ.. వారు ముందుగా పంపిణీదారులు. వారు రచయిత కొరటాల శివను ఎంచుకున్నందుకు అందరూ హ్యాపీ ఫీలయ్యారు. తదుపరి శ్రీమంతుడు సినిమాను అమెరికాలో పంపిణీదారులుగా వ్యవహరించిన ముగ్గురు కలసి.. మైత్రీ మూవీస్ అంటూ సంస్థ పెట్టుకొని.. సినిమాను తీశారు. ఇప్పుడు జనతా గ్యారేజ్‌ కూడా వారే తీస్తున్నారు. ఆ తరువాత మనోడు తీయబోయే రెండు సినిమాలకూ మిక్కిలినేని సుధాకర్ అనే పంపిణీదారుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇలా పంపిణీదారులందరూ తాము నిర్మాతలగా మారాలంటే కొరటాల శివనే ఎందుకు ఎంచుకుంటున్నారు అంటారూ? మనోడేమైనా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నాడా లేకపోతే తమ డబ్బులు సేఫ్‌ గా ఉంటాయి అనే నమ్మకంతో వీరందరూ అతని వెంటపడుతున్నారో. చూడాలి మరి.
Tags:    

Similar News