బన్నీతో ఒకె చేయించుకుని చెక్కేశాడా?

Update: 2015-08-25 03:52 GMT
ప్రస్తుతం హిట్‌ కొట్టిన సినిమాల టీమ్స్‌ అన్నీ రెస్టు తీసుకునే పనిలో ఉన్నాయి. ఎందుకంటే మనోళ్ళు పెద్ద పెద్ద హిట్లు కొట్టి అలసిపోయారు కాబట్టి, కాసింత ఒంటికి ఉపశమనం అవసరం. అందుకే సేద తీరుతున్నారు. శ్రీమంతుడు మహేష్‌ బ్యాంకాక్‌ వెళ్లొస్తే, బాహుబలి ప్రభాస్‌ ఇంకా యురోప్‌ నుండి తిరిగి రాలేదు. అయితే ఇక్కడ హీరోలే కాదు, దర్శకులు కూడా వెకేషన్‌ మూడ్‌ లోనే ఉన్నారు.

ముఖ్యంగా అందరి కళ్ళూ కొరటాల శివపై పడ్డాయ్‌. ఎందుకంటే మనోడు ద్వితీయ విజ్ఞం అనేది లేకుండా హిట్టు కొట్టిన అతికొద్దిమంది డైరక్టర్లలో ఒకడు. అందుకే ఇప్పుడు మూడో సినిమాతో హ్యాట్రిక్‌ కొడతాడా అంటూ అందరూ వెయిట్‌ చేస్తున్నారు. కాకపోతే ఆ మూడు ఎవరితో ముడిపడుంది అనేది మాత్రం తెలియదు. మొన్నటివరకు జూ.ఎన్టీఆర్‌ పేరు చాలా పెద్దగా వినిపించినప్పటికీ, ఇప్పుడు మాత్రం మరొక పేరు వినిపిస్తోంది.

నిజానికి కొరటాల కూడా అమెరికాలో వెకేషన్‌ చేసుకోవడానికి బయలుదేరాడు. అయితే తాను గతంలో చెప్పిన కథను ఎన్టీఆర్‌ ఓకె చేయకపోవడంతో ఇప్పుడు మరొక లైన్‌ ను తయారుచేసి అల్లు అర్జున్‌ కు వినిపించాడట. బోయపాటి తో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే మనం వర్క్‌ చేసేద్దాం అని బన్నీ మాటివ్వడంతో ఇక మనోడు హ్యాపీగా ఓకే సంతకం పెట్టేసి మరీ అమెరికా చెక్కేశాడని ఒక టాక్‌. చూద్దాం ఇందులో ఎంతవరకు నిజముందో...
Tags:    

Similar News