హీరోలు మారిపోయారు అంటున్న కొరటాల

Update: 2016-08-28 04:42 GMT
ఒకప్పుడు కొందరి స్టార్ హీరోల సినిమాల్లో 'మా నాన్న.. మా తాత' వంటి డైలాగులే ఎక్కువగా కనిపించేవి. ఆ తరువాత సీజన్లో 'నా బ్లడ్డు.. కొడితే షెడ్డు' వంటి హీరోయిజమ్ డైలాగులు పేలాయ్. అయితే ఇవన్నీ జనాలు ఎందుకు ఈ మధ్యన వినడానికి ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన హీరోలు మారిపోయారు అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ.

ఈయన దర్శకత్వంలో రూపొందిన ''జనతా గ్యారేజ్‌'' సినిమా వచ్చే వారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన కొరటాల.. ''ప్రేక్షకుల టేస్ట్ మారింది. స్టార్స్ కూడా మారుతున్నారు. హీరోయిజమ్ అండ్ కుటుంబ చరిత్రకు సంబంధించిన డైలాగులు రాస్తే ప్రేక్షకులు గోల చేస్తారు.. తీసేయండి అని ఇప్పుడు స్టార్ హీరోలే చెబుతున్నారు'' అంటూ చెప్పాడు. ఈ సందర్భంగా మనోడు ఫ్యాన్స్ పై ఒక పంచ్ వేశాడు. ''ఈ ఫ్యాన్స్ ఉన్నారే.. ఫస్ట్ డే సినిమా చూసిన తర్వాత.. షేర్ ఎంత? అని అడుగుతున్నారు. సినిమా బాగుందో? లేదో? చెప్పకుండా.. ఇవి అవసరమా?'' అంటూ.. ఈరోజు వసూళ్ల గురించి మాట్లాడే స్థాయికి సినిమా చేరుకోవడం మంచో చెడో చెప్పలేం అంటున్నాడు కొరటాల శివ.

అయితే హీరోలు ఈ కలక్షన్ల గురించి ఏమంటున్నారు? ''ఫ్యాన్స్ అండ్ మీడియా తప్ప.. హీరోలు అండ్ దర్శకులు వసూళ్లకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కథేంటి? నా పాత్ర ఏంటి? నా లుక్ ఎలా ఉండాలి? అనే హీరోలందరూ ఆలోచిస్తున్నారు. ఈ వసూళ్ల గొడవ లేకుంటే హీరోలు మనశ్శాంతిగా ఉంటారు'' అంటూ 'జనతా గ్యారేజ్' డైరక్టర్ హితబోధ చేశాడు.
Tags:    

Similar News