మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణ పూర్తి అయ్యింది. దాంతో గత ఆరు నెలలుగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వస్తున్న చిరు 152వ చిత్రానికి సంబంధించిన పనులు వేగవంతం అవుతున్నాయి. చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక అది చిరంజీవి సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉండటం కామన్.
మొదట సైరా చిత్రీకరణలో ఉన్న సమయంలోనే కొరటాల కూడా సినిమాను మొదలు పెట్టాలనుకున్నాడు. కాని చిరంజీవి వయసు రీత్యా రెండు సినిమాలను ఒకేసారి చేయడం వల్ల ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో రెండు చిత్రాలకు నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ చిత్రాన్ని కాస్త హోల్డ్ లో పెట్టాడు. కొరటాల శివను ఒప్పించి రామ్ చరణ్ వెయిటింగ్ లో పెట్టాడు.
భరత్ అనే నేను విడుదలైన దాదాపు సంవత్సరంనరకు కొరటాల మూవీని మొదలు పెట్టబోతున్నాడు. రంగస్థలం విలేజ్ సెట్ పక్కనే భారీ సెట్టింగ్స్ ను చిరు 152వ చిత్రం కోసం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తో పాటు కొరటాల శివ సన్నిహితుడు నిర్మించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో సినిమాను ఎక్కువ ఆలస్యం లేకుండా విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
సినిమాను ఆగస్టు నెల నుండి సెట్స్ పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈలోపు చిరంజీవి మరింత బరువు తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ చిత్రం కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.