క‌ర‌ణ్ షోకు ఆ ఇద్ద‌రు స్టార్స్ డుమ్మా కొట్టేశారా?

Update: 2022-07-01 03:30 GMT
బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ సినిమాలు నిర్మించ‌డ‌మే కాకుండా పాపుల‌ర్ టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. క‌ర‌ణ్ నిర్వ‌హిస్తున్న పాపుల‌ర్ షో `కాఫీ విత్ క‌ర‌ణ్‌`. టాప్ సెల‌బ్రిటీల సీక్రెట్ ముచ్చ‌ట్ల స‌మాహారంగా ఆక‌ట్టుకుంటున్న ఈ షో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ ల‌ని పూర్తి చేసుకుంది. అయితే 7వ సీజ‌న్ ని ప్రారంభించ‌డం లేద‌ని ప్ర‌క‌టించిన క‌ర‌ణ్ వెంట‌నే 7వ సీజ‌న్ ని స్టార్ట్ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన షాకిచ్చాడు.

క్రేజీ షోగా పాపుల‌ర్ అయిన ఈ షో తాజా సీజ‌న్ కు సంబంధించిన షూటింగ్ ని ఇప్ప‌టికే కొన్ని ఎపిసోడ్ లు  పూర్తి చేశారు. ఇందులో స‌మంతకు సంబంధించిన ఎపిసోడ్ కీల‌కంగా మారిన‌ట్టుగా తెలుస్తోంది.

క‌ర‌ణ్ త‌న షోలోకి ఎంట్రీ ఇచ్చిన వారిని చిలిపి ప్ర‌శ్న‌ల‌తో ఆట‌ప‌ట్టిస్తూ వెంటాడు. ఇక కాంట్ర‌వ‌ర్సీ ప్ర‌శ్న‌ల‌కు ఈ షోలో కొద‌వే వుండ‌దు. దీంతో సమంత త‌న విడాకులుకు సంబంధించిన విష‌యాల‌ని కూడా క‌ర‌ణ్ కి చెప్పి వుంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లైంది.

ఇదిలా వుంటే ఈ షోలో బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్ జోడీ తో పాటు అక్ష‌య్ కుమార్‌, `లైగ‌ర్` తో బాలీవుడ్ బాట ప‌డుతున్న రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ అన‌న్య పాండే కూడా పాల్గొంటున్నార‌ట‌. ఇప్ప‌టికే కొంత మంది స్టార్ల‌కు సంబంధించిన ఎపిసోడ్ ల షూటింగ్ కూడా పూర్త‌యింద‌ని తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కూడా వున్నార‌ట‌.  

క‌రణ్ ప్లాన్ ప్ర‌కారం ముందు ఈ స్టార్స్ కు సంబంధించిన ఎపిసోడ్ తోనే సీజ‌న్ 7ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. అయితే మ‌న స్టార్స్ ఈ సారి క‌ర‌ణ్ షోకు డుమ్మా కొట్టేశార‌ని ముంబై మీడియా చెబుతోంది. ఈ సారికి క‌ర‌ణ్ షోని మ‌న స్టార్స్ అవాయిడ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందుకే క‌ర‌ణ్ కి ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో వీరి స్థానంలో టైగ‌ర్ ష్రాఫ్. కృతిస‌న‌న్ జోడీని చివ‌రి నిమిషంలో క‌ర‌ణ్‌ రంగంలోకి దింపేశాడ‌ట .

ఇదిలా వుంటే మే లో సీజ‌న్ 7 వుంటుంద‌ని క‌ర‌ణ్ జోహార్ అధికారికంగా అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ షో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో జూలై 7 నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో సౌత్ నుంచి ఈ షోలో తొలిసారి అడుగుపెట్టిన స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలాంటి విష‌యాల్ని ఈ షోలో క‌ర‌ణ్ తో పంచుకున్నార‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News