• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లెప్పుడో ఓపెన‌యిన...

పెళ్లెప్పుడో ఓపెన‌యిన కియ‌రా అద్వాణీ

By - Tupaki Desk
Update: 2022-08-25 04:59 GMT
'కాఫీ విత్ కరణ్ 7' ఎనిమిది ఎపిసోడ్లు ఇప్ప‌టికే ఓటీటీలో వేడెక్కించాయి. ఇందులో క‌థానాయిక‌ల వ్య‌క్తిగ‌త విష‌యాలు గుట్టు మ‌ట్లు లీక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే జాన్వీ క‌పూర్- సారా అలీఖాన్ త‌మ ల‌వ్ లైఫ్ గురించి.. బోయ్ ఫ్రెండ్స్ గురించి ప్ర‌తిదీ ఓపెన‌య్యారు. ఇప్పుడు కియారా అద్వానీ వంతు. తన గురించి తాను కియ‌రా ఎంతో ఓపెన్ గా క‌ర‌ణ్ షోలో మాట్లాడింది.
     
కియారా అద్వానీ బాలీవుడ్ లో అగ్ర నాయిక‌గా కొన‌సాగుతోంది. ఇటీవ‌లే 'భూల్ భూలయ్యా 2' ..'జగ్ జగ్ జీయో' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకుని న‌టిగా రేసులో దూసుకుపోతోంది. కేజేవో షోలో త‌న క‌బీర్ సింగ్ కోస్టార్ షాహిద్ కపూర్ తో క‌లిసి కియ‌రా క‌నిపించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత పాపులారిటీ ఉన్న హీరోల్లో ఒకడిగా షాహిద్ కి గుర్తింపు ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్న ఆయన తన ప్రయాణంలో ఎన్నో చిరస్మరణీయమైన ప్రదర్శనలు ఇచ్చారు. షాహిద్ కపూర్ - కియారా అద్వానీ 2019లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రం 'కబీర్ సింగ్‌'లో కబీర్- ప్రీతి పాత్రలను పోషించి హృదయాలను గెలుచుకున్నారు. వీరిద్దరూ అద్భుత‌మైన‌ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో మ‌రిపించారు. ఇప్పుడు ఈ జంట‌ కరణ్ జోహార్ వివాదాస్పద గాసిప్ షో కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ లో క‌నిపించారు. ఎపిసోడ్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఈ ఎపిసోడ్ లో కియారా అద్వానీ రిలేషన్ షిప్ స్టేటస్  వివాహ ప్రణాళికల గురించి చాలా చర్చ జరిగింది. కియ‌రా చాలా సందర్భాలలో రిలేషన్ షిప్ పుకార్లను కొట్టిపారేసింది. అలాంటి వార్త‌లు వినిపిస్తున్నా కానీ వాటిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం  చేసింది. కియారా తన వివాహ ప్రణాళికల గురించి ప్ర‌శ్నించ‌గా.."నేను మా ఇంట్లో అందమైన వివాహా వేడుక‌ల‌ను చూశాను కాబట్టి... వివాహ వ్య‌వ‌స్థ‌ను ఎప్పుడూ నమ్ముతున్నాను. పెళ్లి అనేది క‌చ్చితంగా నా జీవితంలో నేను చూసేదే.. కానీ నేను దీని గురించి ఇప్పుడే వెల్లడించను. అది కూడా ఈరోజు కాఫీ విత్ కరణ్ లో" అంటూ య‌థావిధిగా దాప‌రికం ప్ర‌ద‌ర్శించింది.

కరణ్ - షాహిద్ మరిన్ని వివరాలను త‌న నుంచి రాబ‌ట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మీ పెళ్లికి న‌న్ను ఆహ్వానించరా? అని కూడా క‌ర‌ణ్ కియ‌రాను అడిగాడు. అయితే త‌న‌ను క‌చ్చితంగా ఆహ్వానిస్తానని వెంటనే ధృవీకరించింది. షోలో అనేక ఇతర సెన్సిటివ్ అంశాలు అరుదైన‌ మూవ్ మెంట్స్ ఆక‌ట్టుకున్నాయి. ఇదే టాక్ షోలో కరణ్ తన తదుపరి యాక్షన్ చిత్రంలో అవ‌కాశాన్ని కియారా ధృవీక‌రించింది.

కాఫీ విత్ కరణ్ 7లొ తాజా పూర్తి ఎపిసోడ్ సంబంధిత ప్లాట్ ఫారమ్ లో వీక్షించేందుకు అందుబాటులో ఉంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... కియారా అద్వానీ 'గోవింద నామ్ మేరా'లో న‌టిస్తోంది. అలాగే రామ్ చరణ్ తదుపరి ఎస్. శంకర్ తో ఆర్.సి 15 చిత్రీక‌ర‌ణ సాగుతోంది. 'సత్య ప్రేమ్ కి కథ'లో కార్తీక్ ఆర్యన్ స‌ర‌స‌న న‌టిస్తోంది.

మ‌రోవైపు అలీ అబ్బాస్ జాఫర్ తదుపరి యాక్షన్ చిత్రంలో షాహిద్ కపూర్ కనిపించనున్నాడు. ఇది డిజిటల్ గా స్ట్రీమింగ్ కానుంది.  రాశి ఖన్నా - విజయ్ సేతుపతితో కలిసి నటించిన రాజ్ అండ్ DK సిరీస్ 'ఫర్జీ'లో కూడా షాహిద్ కనిపిస్తాడు. కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ కోసం అత‌డు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆ తర్వాత కూడా మ‌రో  యాక్షన్ చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభిస్తాడని తెలిసింది.
Tags:    
  • KoffeWithKaran 
  • KiaraAdvani 
  • ShahidKapoor 
  • Interview 
  • Wedding 
  • Open 
  • KabirSingh 
  • Bollywood 
  • KaranJohar 
  • TupakiNews 
  • MovieNews 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS