కుదిరితే 'ఖైదీ' .. లేదంటే 'ఖాకీ' సీక్వెల్!

Update: 2021-05-02 14:30 GMT
కార్తి మంచి నటుడు .. తమిళంతో పాటు తెలుగులోను ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంతో పాటుగా తెలుగులోను తన సినిమాలు విడుదలయ్యేలా ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. కార్తి తన కెరియర్లో చేసిన విభిన్నమైన సినిమాలలో 'ఖాకీ' .. 'ఖైదీ' ముందువరుసలో కనిపిస్తాయి. తమిళనాట మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమాలకి విశేషమైన ఆదరణ లభించింది. ఈ రెండు సినిమాలు ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టాయి.

'ఖైదీ' తరువాత కార్తి చేసిన సినిమాలు ఆశించినస్థాయిలో ఆడలేదు. ఇటీవల వచ్చిన 'సుల్తాన్' కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక్కడ రష్మికకి గల క్రేజ్ కూడా ఈ సినిమాను ఆదుకోలేకపోయింది. దాంతో తనకి వెంటనే మంచి హిట్ పడాలంటే 'ఖాకీ' సీక్వెల్ గానీ .. 'ఖైదీ' సీక్వెల్ గాని చేయాలని కార్తి నిర్ణయించుకున్నాడట. ఈ రెండు కథలు కూడా సీక్వెల్ కి కావలసినంత అవకాశము ఉన్నవే. ఆ దిశగా ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని అంటున్నారు.


'ఖాకీ' సినిమా చేసిన హెచ్.వినోత్ ప్రస్తుతం అజిత్ హీరోగా 'వలిమై' చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుకు అవసరమైన కథను కూడా రెడీ చేసుకోమని ఆయనకి అజిత్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక 'ఖైదీ' సినిమాను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్, కమల్ కథనాయకుడిగా 'విక్రమ్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయనకి విజయ్ .. రజనీల ఆఫర్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు సినిమాల సీక్వెల్ కోసం కార్తి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.      
Tags:    

Similar News