ఆ బ్లాక్ బస్టర్ సీక్వెల్ 'వేరే లెవెల్'లో ఉండబోతుందంట..!!
సినీ ఇండస్ట్రీలో కన్నడ మూవీ కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ ఒక్క సినిమాతో స్టార్ హీరో యష్ కాస్త పాన్ ఇండియన్ హీరో అయిపోయాడు. ఒక్కసారిగా కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో సినీ ప్రేక్షకులను పరిచయం చేసాడు. ఈ సినిమాతో తనలోని విశ్వరూపం చూపించేశారు మేకర్స్. 2018 డిసెంబర్ నెలలో విడుదలైన కేజీఎఫ్ చాఫ్టర్1 మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి రికార్డు విజయం నమోదు చేసింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు 200 కోట్ల పైచిలుకు వసూల్ చేసిన మొదటి కన్నడ సినిమాగా కేజీఎఫ్ రికార్డు బద్దలు కొట్టింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సెకండ్ పార్ట్ కోసం దేశవాప్తంగా సినీ ఫ్యాన్స్ ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్2 సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి కేజీఎఫ్-2 మాత్రం జనాలు ఊహించేదానికి కాస్త డిఫరెంట్ గానే వేరే లెవెల్ లో ఉండబోతుందని సమాచారం. ఎందుకంటే మొదటి పార్టులో ఇంట్రడక్షన్ అండ్ కేజీఎఫ్ లోకి హీరో ఎంట్రీ చూపిన మేకర్స్ అసలు కథ సెకండ్ పార్టులో ఉందంటున్నారు. ఫస్ట్ చాప్టర్ మించిన యాక్షన్, భారీ ఫైట్ సీక్వెన్సులు, భారీ తారాగణంతో రూపొందుతుంది. అంతేగాక రాజకీయ అంశాలు కూడా జోడించినట్లు మనకు కేజీఎఫ్ క్లైమాక్స్ చూస్తేనే అర్ధమవుతుంది. అయితే ఈ సినిమా మళ్లీ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. త్వరలో కేజీఎఫ్-2 ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఇక శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరగాందుర్ నిర్మిస్తున్నారు.