దైవ సన్నిధిలో రాఖీభాయ్ టీమ్ హంగామా
కన్నడ స్టార్ యష్ నటించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సైలెంట్ గా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. భారతీయ తెలరపై హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతికి ప్రేక్షకులు లోను కావడంతో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న `కేజీఎఫ్ చాప్టర్ 2` పై భారీ అంచనాలు నెల కొన్నాయి. ఐదు భాషల్లో విడుదలైన `కేజీఎఫ్ చాప్టర్ 1` వరల్డ్ వైడ్ గా 238 కోట్లు మేర వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో పార్ట్ 2పై వరల్డ్ వైడ్ గా అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇటీవల హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే 235 ప్లస్ మిలియన్ ల వ్యూస్ ని సాధించి ఇప్పటి వరకు రిలీజైన ట్రైలర్ లలో సరికొత్త రికార్డుని సృష్టించింది.
ఇక ఈ ట్రైలర్ ని 9.2 మిలియన్ ల మంది లైక్ చేయడంతో ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పష్టమైంది. భారీ అంచనాలు నెలకొన్నఈ సినిమా రిలీజ్ కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నామంటూ చిత్ర బృందం ఇటీవల ప్రకటించి సినిమా రిలీజ్ పై స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మరో రెండు నెలల్లో ఈ మూవీ థియేటర్లలో అత్యంత భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం కర్ణాటకలోని కొల్లూరు లో గల శ్రీ మూకాంబిక, ఆనెగుడ్డె శ్రీ వినాయక ఆలయాలను సందర్శించి వారి ఆశీస్సులు పొందారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో కేజీఎఫ్ టీమ్ పంచుకున్నారు.
త్వరలో ఉత్తేజకరమైన రోజులు రాబోతున్నాయని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి విముక్తి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నఈ ప్రపంచానికి మంచి రోజులు రాబోతున్నాయని ఈ ఫొటోలకు ఆసక్తికరమైప పోస్ట్ ని జత చేశారు. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీలో రవీనా టాండన్ ప్రధాని రమికా సేన్ గానూ, సంజయ్ దత్ అధీరాగానూ నటించారు. మిగతా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రావు రమేష్ కనిపించనున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ఏ స్థాయి సంచలనాలకు నాంది పలుకుతుందో చూడాలి.