బాహుబలి రికార్డు బ్రేక్ చేసే దిశగా కేజీఎఫ్

Update: 2019-01-18 16:23 GMT
కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన 'కేజీఎఫ్' ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాటి నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.  ముఖ్యంగా ట్రైలర్ 'కేజీఎఫ్' పై అంచనాలను భారీగా పెంచేసింది. దానికి తగ్గట్టే సినిమాకూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ వర్షం కురిసింది.  ఒక కన్నడ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం ఇదే మొదటిసారి.  

ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్' ఇప్పటికే రూ. 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మార్కును దాటేసింది.  ఇలాంటి రికార్డు సాధించిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్' మాత్రమే. అంతే కాదు కన్నడ వెర్షన్ మాత్రమే తీసుకుంటే 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన తొలి కన్నడ చిత్రంగా ఇప్పటికే రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది.  ఇవి మాత్రమే కాకుండా మరో భారీ రికార్డు దిశగా 'కేజీఎఫ్' దూసుకుపోతోంది.  కర్ణాటకలో అత్యధిక వసూళ్ళు సాధించిన రికార్డు రూ. 129 కోట్లతో 'బాహుబలి 2' పేరిట ఉంది.  ప్రస్తుతం 'కేజీఎఫ్' కలెక్షన్స్ రూ.121 కోట్లు. ఇప్పటికీ ఈ సినిమా కర్ణాటకలో భారీ వసూళ్ళు సాధిస్తోంది.  దీంతో 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేయడం ఖాయమేనని అంటున్నారు.

మొదటి నుంచి కన్నడ సినిమా మార్కెట్ చాలా తక్కువ. తెలుగు.. తమిళ భాషల మార్కెట్ తో పోలిస్తే బడ్జెట్లు తక్కువే.. కలెక్షన్లు కూడా తక్కువే.  'కేజీఎఫ్' విజయం తో ఒక్కసారిగా కన్నడ సినిమా ఇండస్ట్రీ సత్తా అందరికీ తెలిసింది.  దీంతో చాలామంది కన్నడ ఫిలిం మేకర్లు 'కేజీఎఫ్' బాటలో పయనించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.  
    

Tags:    

Similar News