`కేజీఎఫ్ 2` బిజినెస్ పై పుకార్లు ఏవీ న‌మ్మొద్దు!

Update: 2020-05-19 04:30 GMT
కోలార్(క‌ర్నాట‌క‌) బంగారు గ‌నుల మాఫియా నేప‌థ్యంలో తెర‌కెక్కిన `కేజీఎప్ చాప్ట‌ర్ 1` సంచ‌లన విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 280 కోట్ల మేర షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది ఈ చిత్రం. కేవ‌లం క‌న్న‌డం నుంచే వంద‌ కోట్ల షేర్ వ‌సూలైంది. హిందీ స‌హా ఇరుగుపొరుగునా అత్యుత్త‌మ వ‌సూళ్ల‌ను సాధించిన క‌న్న‌డ‌ చిత్రంగా రికార్డుల‌కెక్కింది. ఈ ఒక్క సినిమాతో హీరో య‌ష్.. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.. హోంబ‌లే సంస్థ‌ రేంజు అమాంతం మారిపోయింది. అలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకి పార్ట్ 2 వ‌స్తోంది అంటే ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంటుంది.

ప్ర‌స్తుతం కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సెట్స్ పై ఉంది. పార్ట్ 2లో అధీర అనే విల‌న్ పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. ర‌వీనా టాండ‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. మెజారిటీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా బ్యాలెన్స్ షెడ్యూల్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక కేజీఎఫ్ విజ‌యం నేప‌థ్యంలో పార్ట్ 2 పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. అందుకు త‌గ్గ‌ట్టే సీక్వెల్ బిజినెస్ హై రేంజులో జ‌రిగిపోతోంద‌ని ప్ర‌చారం సాగిపోతోంది. ఇప్ప‌టికే శాటిలైట్ బిజినెస్ పూర్త‌యింద‌ని వార్త‌లొచ్చాయి.

అయితే దీనిపై చిత్ర‌బృందం స్పందించింది. ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేద‌ని వెల్ల‌డించింది. దాదాపు 120 కోట్ల మేర డీల్  పూర్త‌యింద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని చిత్ర‌బృందం క్లారిటీనిచ్చింది. ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. కానీ ఇంకా అమ్మ‌లేదని వెల్ల‌డించారు. అలాగే ఈ సినిమా సీక్వెల్ అంటూ ప్ర‌చారం సాగుతోంది కానీ.. ఇది కేవ‌లం మొద‌టి భాగానికి ప్రీక్వెల్ మాత్ర‌మే. ఈ ఫ్రాంఛైజీలో మునుముందు వ‌రుస‌గా సినిమాలు వ‌స్తాయి.. అని వెల్ల‌డించారు. సిరీస్ ని ఆప‌కుండా కొన‌సాగిస్తామ‌ని అన్నారు.
Tags:    

Similar News