మోషన్ పోస్టర్ లోనే 'రామరాజు ఫర్ భీమ్' హింట్ ఉందట..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోషిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో మే 20న ఎన్టీఆర్ బర్త్ డేకి రాబోతున్న 'కొమరం భీమ్' వీడియోలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో అంటూ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు 'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ ఇంట్రో వీడియోని రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 20కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి సంగీతం అందించిన కీరవాణిని 'ఎన్టీఆర్ వీడియో ఎలా ఉంటుంది' అని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పారు.
'ఆర్ ఆర్ ఆర్' మోషన్ పోస్టర్ లోనే ఎన్టీఆర్ ఇంట్రో వీడియోకి సంబందించిన హింట్ ఉందని.. ఆ మోషన్ పోస్టర్ చూసి మీరు అర్థం చేసుకో గలిగితే మే 20న రానున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఎలా ఉంటుందో అర్థం అవుతుందని కీరవాణి చెప్పుకొచ్చారు. దీంతో సినీ అభిమానులందరూ 'ఆర్ ఆర్ ఆర్' మోషన్ పోస్టర్ ని రిపీటెడ్ గా చూడటం మొదలు పెట్టారు. దానిలో ఏమేమి దాగున్నాయో అంటూ వెతకడం స్టార్ట్ చేశారు తారక్ ఫ్యాన్స్. అయినా ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఇంకో రెండు వారలు వెయిట్ చేస్తే 'భీమ్' వచ్చేస్తాడుగా. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ పలువురు హాలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రూపొందిస్తున్న సినిమా కావడంతో 'ఆర్.ఆర్.ఆర్'పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా ఇద్దరు స్టార్ హీరోలను సిల్వర్ స్క్రీన్ మీద ఎలా బ్యాలన్స్ చేసాడో తెలుసుకోడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. పలు భారతీయ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 8న ఆర్.ఆర్.ఆర్ విడుదల కానుంది.