మన పాన్‌ ఇండియా స్టార్స్ తో కత్రీనా రొమాన్స్‌

Update: 2021-05-07 11:30 GMT
టాలీవుడ్‌ హీరోల్లో పలువురు బాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఎంతో మంది టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్‌ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తో ప్రభాస్ బాలీవుడ్‌ స్టార్‌ హీరోలను మించిన స్టార్‌ డంను దక్కించుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు కలిగి ఉన్నాడు అనడంలో సందేహం లేదు. వీరిద్దరితో ప్రస్తుతం బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్ నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పలువురు టాలీవుడ్‌ హీరోలతో నటించేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇప్పటికే ప్రభాస్ తో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్దా కపూర్‌ నటించింది. ఆదిపురుష్‌ సినిమా లో ప్రభాస్‌ కు జోడీగా కృతి సనన్‌ నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా లో అనన్య పాండే నటిస్తోంది. ప్రభాస్ మరియు విజయ్ దేవరకొండ తో త్వరలో కత్రీనా కైఫ్‌ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో తెలుగులో నటించిన కత్రీనా కైఫ్‌ మళ్లీ చాలా కాలం తర్వాత నటించేందుకు సిద్దం అయ్యింది.

ప్రభాస్ తో బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సిద్దార్థ్ ఆనంద్‌ ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా లో హీరోయిన్ గా కత్రీనా కైఫ్‌ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్‌ తో మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండతో కూడా ఒక సినిమా ను కత్రీనా కైఫ్‌ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. కత్రీనా మాత్రమే కాకుండా పలువురు హీరోయిన్స్ కూడా తెలుగులో నటించేందుకు సిద్దంగా ఉన్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపిక పదుకునే త్వరలోనే ప్రభాస్ తో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న మన స్టార్స్‌ తో కలిసి నటించేందుకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు పలువురు ఆసక్తిగా ఉన్నారు. ముందు ముందు మరింత మంది  హీరోయిన్స్‌ తెలుగు లో నటించే అవకాశం ఉందేమో చూడాలి.
Tags:    

Similar News