ఫోటో స్టోరి: లేడీ హృతిక్ లా కిలాడీ రెబ‌ల్ లా ఉంది!

Update: 2021-02-09 02:30 GMT
ఇండియ‌న్ వెర్ష‌న్ సూప‌ర్ ఉమెన్ గా మెరుపులు మెరిపించేందుకు  రంగం సిద్ధం చేస్తోంది క‌త్రిన కైఫ్‌. దేశంలోనే తొలి సూప‌ర్ గాళ్ గా అవ‌త‌రించ‌నుంది. టైగ‌ర్ సిరీస్ ద‌ర్శకుడు అబ్బాస్ అలీ అందుకు స్క్రిప్టు ప‌నుల్లో ఉన్నారు. ఈలోగానే స్టార్ హీరోల‌తో క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేసి త‌న‌ని తాను ఫిజిక‌ల్ గా మెంట‌ల్ గా సంసిద్ధం చేసుకునే ఆలోచ‌న‌తో ఉంది క‌త్రిన‌‌. మ‌రో అవ‌తార్ లా మ‌రో వాకండా (బ్లాక్ పాంథ‌ర్) గ్ర‌హ‌వాసిలా క‌త్రిన రెడీ కావాల్సి ఉంటుంద‌ట‌.

తాజాగా క‌త్రిన జీక్యూ క‌వ‌ర్ పేజీ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోలో క‌త్రిన అల్ట్రా స్టైలిష్ లుక్ పై యూత్ ఒక‌టే ఆస‌క్తిగా మాట్లాడుకుంటోంది. స్టైల్ ఐక‌న్ అన్న ప‌దానికే మీనింగ్ క‌త్రిన‌. అంత స్టైల్ గా క‌నిపిస్తోంది ఈ లుక్ లో. టాప్ టు బాట‌మ్ డిజైన‌ర్ చార‌ల సూట్ డ్రెస్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా త‌న‌కోస‌మే తీర్చిదిద్దిన‌ట్టుగా కుదిరింది. ఇక విర‌బోసిన శిరోజాల‌తో క‌త్రిన రెబ‌ల్ లుక్ అంతే ఆక‌ట్టుకుంది. ఇంకా చెప్పాలంటే లేడీ హృతిక్ లా లేడీ టైస‌న్ లా ఉంది! అంటూ బోయ్స్ కామెంట్ల‌తో వేడెక్కిస్తున్నారు.

అక్షయ్ కుమార్ స‌ర‌స‌న‌ కత్రినా కైఫ్ నటించిన కాప్ యాక్ష‌న్ డ్రామా `సూర్య‌వంశీ` ఈ వేసవి థియేటర్లలోకి రానుంద‌ని తెలుస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఈ మూవీకి రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అజయ్ దేవ్ గన్ -రణ్ ‌వీర్ సింగ్ అతిధి పాత్రలో నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. టైగ‌ర్ 3లో స‌ల్మాన్ స‌ర‌స‌న‌ క‌త్రిన న‌టించ‌నుంది.
Tags:    

Similar News