37 ఏజ్ లోనూ క‌రోనా సోకినా ఈ కంబ్యాక్ కి హ్యాట్సాఫ్!

Update: 2021-07-15 00:30 GMT
37 ఏజ్ లోనూ టీనేజీ మిస‌మిసల‌తో కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది కత్రిన‌. కానీ ఇటీవ‌ల ఈ భామ గ్లామ‌ర్ కించిత్ త‌గ్గింద‌నే అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు. ఇటీవ‌ల‌ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రిన‌.. త‌న స్నేహితుడు విక్కీ కౌశ‌ల్ కి కోవిడ్ సోక‌డంతో స్వీయ‌నిర్భంధంలో చికిత్స పొందారు. చికిత్స‌తో వేగంగానే కోలుకున్నారు. వైర‌స్ ప్ర‌భావంతో  క‌త్రిన గ్లామ‌ర్ కూడా త‌గ్గింది. అయితే క‌త్రిన మ‌ళ్లీ జిమ్ కెళ్లి ఫిట్ అండ్ హాట్ గా త‌యారైన సంగ‌తి వేరే..

ఇటీవ‌ల జిమ్ చేసి తిరిగి ట్రాక్ లో ప‌డ్డ క‌త్రిన పాత అందాల‌తో మ‌రోసారి అల‌రిస్తోంది. క‌త్రిన లేటెస్ట్ ఫోటోషూట్ అందుకు సాక్ష్యం. తాజాగా క‌త్రిన ఫ్లోర‌ల్ క్రాప్ టాప్ తో మెరుపులు మెరిపిస్తున్న వీడియో వైర‌ల్ గా మారింది. త‌న‌దైన మార్క్ చిరున‌వ్వుల‌తో క‌త్రిన ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులివ్వ‌గా మాష‌ప్ వీడియోని వైర‌ల్ చేసారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..  అక్షయ్ కుమార్ -క‌త్రిన నటించిన `సూర్యవంశీ` విడుదల కావాల్సి ఉంది. త‌దుప‌రి క‌త్రిన టైగ‌ర్ 3లో న‌టిస్తోంది. అలాగే టైగ‌ర్ జిందా హై ద‌ర్శ‌కుడు జాఫ‌ర్ తెర‌కెక్కించే మ‌రో చిత్రంలో సూప‌ర్ గాళ్ త‌ర‌హా పాత్ర‌లోనూ న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. టైగ‌ర్ సిరీస్ లో క‌త్రిన యాక్ష‌న్ క్వీన్ గా వెలిగిపోతోంది. అందుకే త‌న‌నే సూప‌ర్ హీరోయిన్ గా మార్చేస్తున్నారు ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫర్.


Full View
Tags:    

Similar News