మారుతి మార్క్ ప్లానింగ్.. ఆ టెన్షన్ లేనట్లే.

టాలీవుడ్‌లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత దర్శకులకు తదుపరి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం ఒక పెద్ద సవాలుగా మారుతోంది.;

Update: 2026-01-20 04:02 GMT

టాలీవుడ్‌లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత దర్శకులకు తదుపరి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఫలితం విషయంలో ఏమాత్రం తేడా కొట్టినా పరిస్థితి మరోలా ఉంటోంది. గతంలో 'రాధేశ్యామ్' వంటి భారీ చిత్రం తీసిన రాధాకృష్ణకు ఇప్పటికీ మరో హీరో దొరకలేదు. అలాగే 'దేవర'తో కమర్షియల్ హిట్ కొట్టినా కూడా ఏ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. అయితే, ప్రభాస్ 'ది రాజాసాబ్' ఫలితం ఎలా ఉన్నా, మారుతి విషయంలో మాత్రం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తోంది.

సినిమా చేయడానికి నిర్మాతలు, హీరోలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని అర్ధమవుతుంది. మారుతికి ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద బలం నిర్మాతలకు ఇచ్చే కంఫర్ట్. రాజాసాబ్ కంటే ముందు ఎక్కువగా మీడియం బడ్జెట్ సినిమాలే చేశారు. ఆ రూట్లో వెళితే నిర్మాతలకు భారంగా మారకుండా సేఫ్ బడ్జెట్‌లో ప్రాజెక్టును పట్టాలెక్కించడం ఆయన స్టైల్. అందుకే ఒక భారీ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ మీడియం రేంజ్ సినిమాల వైపు ఆయన వేగంగా అడుగులు వేయగలుగుతున్నారు.

లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో మారుతి కథా చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. మారుతికి గీతా ఆర్ట్స్ సంస్థతో ఉన్న పాత అనుబంధం దృష్ట్యా, వీరిద్దరూ కలిసి వరుణ్ తేజ్ కోసం ఒక వినోదాత్మక సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మినిమం గ్యారెంటీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు వరుణ్ తేజ్ మార్కెట్ కు తగ్గట్టుగా ఒక పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌తో చర్చలు సాగుతున్నట్లు బజ్ వినిపిస్తోంది.

సాధారణంగా భారీ సినిమాల తర్వాత హీరోలు దొరకక దర్శకులు ఖాళీగా ఉండటం చూస్తుంటాం. కానీ మారుతి మాత్రం ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా తన రూట్ మార్చుకుని సేఫ్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. వరుణ్ తేజ్‌తో చర్చలు గనుక ఒక కొలిక్కి వస్తే, చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంచనాలకు తగ్గట్టుగా అంతా కుదిరితే మెగా ప్రిన్స్, మారుతి కాంబోలో ఒక ఫ్రెష్ ఎంటర్‌టైనర్ వచ్చే ఛాన్స్ ఉంది.

మొత్తానికి మారుతి తన నెక్స్ట్ మూవ్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్లు అర్థమవుతోంది. పాన్ ఇండియా రేంజ్ హంగుల కంటే, కంటెంట్ బడ్జెట్ కంట్రోల్ మీద ఫోకస్ పెట్టే మారుతి శైలి ఇతర దర్శకులకు భిన్నంగా ఉంటుంది. అందుకే ఆయనకు హీరోల కొరత అనేది పెద్దగా ఉండదు. మరి వరుణ్ తేజ్‌తో సాగుతున్న ఈ చర్చలు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వరకు వెళ్తాయో లేదో చూడాలి.

Tags:    

Similar News