• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాహుబలికి బిస్కెట్...

బాహుబలికి బిస్కెట్ వేసేసింది

By - Tupaki Desk
Update: 2017-07-02 07:41 GMT
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు తెలుగు సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కెరీర్ తొలినాళ్లలో టాలీవుడ్ మూవీస్ చేసింది ఈ కత్తి లాంటి బ్యూటీ. వెంకటేష్ తో మల్లీశ్వరి.. బాలకృష్ణతో అల్లరి పిడుగు వంటి సినిమాల్లో నటించింది కత్రినా కైఫ్.  ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించేసుకుని.. తెలుగుపై కన్నెత్తి చూడ్డం మానేసింది.

రీసెంట్ గా అయితే.. ప్రభాస్ తో సాహో మూవీలో హీరోయిన్ గా నటించాలంటూ బాలీవుడ్ భామలను సంప్రదించగా.. మొదటగా వినిపించిన పేరు కత్రినా కైఫ్ దే. బాహుబలి తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ పేరు మామూలుగా మోగిపోవడం లేదు. అనేక మంది బాలీవుడ్ తారలు.. ప్రభాస్ తో సినిమా చేయడంపై ఉత్సాహం చూపుతుండగా.. ఇప్పుడీ లిస్ట్ లో కత్రినా కూడా చేరిపోయింది. రీసెంట్ గా జరిగిన సైమా అవార్డుల వేడుకలో.. బాలీవుడ్ మూవీ జగ్గా జాసూస్ కి ఓ ప్రమోషనల్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన మాజీ లవర్ అండ్ జగ్గా జాసూస్ హీరో రణబీర్ తో కలిసి హాజరైన కత్రినా.. సౌత్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మళ్లీ సౌత్ లో అవకాశాలు వస్తే.. దక్షిణాదిలో ఎవరితో కలిసి నటించాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు.. 'విక్రమ్ అద్భుతమైన యాక్టర్. ఇక బాహుబలి ప్రభాస్ కనబరిచిన నటన సూపర్' అంటూ పొగిడేసింది. ప్రభాస్ తో నటించాలనే కోరికను బయటపెట్టి.. ఓ సీట్ రిజర్వ్ చేయమంటూ ఇన్ డైరెక్టుగా బిస్కెట్ వేసేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Katrina Kaif 
  • Prabhas 
  • Vikram 
  • Telugu News 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS