మాజీ లవర్ కి ఎంత సాయం చేస్తున్నాడో

Update: 2017-03-17 13:11 GMT
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. కత్రినా కైఫ్ ల మధ్య బోలెడంత స్టోరీ నడిచేసిన విషయం ఓపెన్ సీక్రెట్. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా పొరపొచ్చాలు రావడం.. ఇద్దరూ విడిపోవడం.. కనీసం కలిసి సినిమా కూడా చేయకపోవడం వంటివి జరిగిపోయాయి. ఇదంతా పాత కథ అయితే.. రణబీర్ కపూర్ కి దూరం అయిన తర్వాత.. కత్రినా కైఫ్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ఫితూర్.. బార్ బార్ దేఖో వంటి చిత్రాలతో పరాజయాలు మూట కట్టుకుంది. ఇదే సమయంలో సల్మాన్ కు మళ్లీ కేట్ చేరువైందనే టాక్ ఉంది. ప్రస్తుతం కత్రినా కెరీర్ ని చక్కదిద్దే బాధ్యతను భుజాన  వేసుకున్న సల్మాన్.. తన స్పై థ్రిల్లర్ మూవీ టైగర్ జిందాహైలో అవకాశం ఇప్పించాడు. అంతే కాదు.. మరో యాంగిల్ కూడా కేట్ కు వీలైనంత సహాయం చేస్తున్నాడు సల్మాన్. తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఓ బ్రాండ్ ను.. కత్రినాకైఫ్ తో ఒప్పందం చేసుకునేకునేందుకు ఒప్పించాడు సల్మాన్.

రీసెంట్ గా వీళ్లిద్దరూ టైగర్ జిందాహై షూటింగ్ కోసం ఆస్ట్రియా వెళ్లగా.. అంతకు ముందే ఆ ఫ్యాషన్ బ్రాండ్ కు ఫోటో షూట్ చేశారు. అయితే.. ఇంకా ఈ యాడ్ షూట్  పూర్తి కాలేదు. ఆస్ట్రియా నుంచి తిరిగి వచ్చాక.. ఈ బ్రాండ్ కోసం కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొంటారు సల్మాన్ అండ్ కేట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News