వీడియో: 'గుండె కథ వింటారా' లోని సోల్ ఫుల్ మెలోడీ 'ఎంత బావుందో'

Update: 2021-08-25 08:02 GMT
ప్రముఖ హాస్యనటుడు మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''గుండె కథ వింటారా''. 'ఇష్క్' 'గుండే జారి గల్లంతయ్యిందే' 'గీతాంజలి' 'ఒక లైలా కోసం' 'టాక్సీవాలా' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కమెడియన్ మధు.. ఇప్పుడు థ్రిల్లర్ తో మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో స్వాతిష్ట కృష్ణన్ మరియు శ్రేయా నావిలే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రంలోని 'ఎంత బావుందో' అనే సాంగ్ ఫుల్ వీడియోని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి విషెస్ అందజేశారు.

'ఎంత బావుందో.. ప‌క్క‌నే ఉన్నా.. మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా... గుప్పెడు గుండె త‌ట్టింది.. ఎవ‌రో నాకు చెప్పింది.. పైకే చెప్ప‌నంటోంది' అంటూ సాగిన ఈ బ్యూటిఫుల్ సోల్ ఫుల్ మెలొడీ వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. దీనికి మ‌సాలా కాఫీ మంచి ట్యూన్ సమకూర్చారు. లిరిసిస్ట్ కృష్ణ చైత‌న్య అందమైన సాహిత్యం అందించగా.. కృష్ట జెకే - వ‌రుణ్ సునీల్ ఈ గీతాన్ని ఆలపించారు. దీనికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. వినసొంపుగా ఉన్న 'ఎంత బావుందో' పాట విజువల్ గా చూడటానికి కూడా అంతే బాగుంది.

''గుండె కథ వింటారా'' చిత్రానికి వంశీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి మంగళంపల్లి మరియు అభిషేక్ చిప్ప సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవివర్మన్ నీలిమేఘం - సురేష్ భార్గవ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సాయి కిరణ్ ముద్దం ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ లను ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ డిజైన్ చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'గుండె కథ వింటారా' సినిమా కమెడియన్ మధు ను హీరోగా నిలబెడుతుందేమో చూడాలి.


Full View
Tags:    

Similar News