రాయుడు రచ్చ: బెనిఫిట్ షోస్ లేవ్

Update: 2017-03-24 00:43 GMT
అసలు పోలీసులు ఎప్పుడు ఏ సినిమా బెనిఫిట్‌ షో కు పర్మిషన్లు ఇస్తారు.. ఎప్పుడు ఇవ్వరు అనే విషయంపై పోలీసులకు కూడా పెద్దగా క్లారిటీ ఉండదేమో. అయితే చాలాసేపు వెయిటింగ్ చేశాక ఇప్పుడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. వారు త్వరత్వరగా 12 గంటలుకే సినిమా చూసేద్దాం అనుకుంటే.. చివరకు బెనిఫిట్ షో క్యాన్సిల్ చేయక తప్పలేదు.

హైదరాబాద్ లోని కూకుట్ పల్లి భ్రమరాంబ-మల్లిఖార్జున ధియేటర్ కాంప్లెక్స్.. అలాగే యర్రగడ్డ శ్రీరాములు ధియేటర్లో ఎప్పుడూ పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తుంటారు. రాత్రి 12 గంటల నుండే ఇక్కడ రచ్చ మొదలవుతుంది. చాలాసార్లు సినిమాను వేయట్లేదు అంటూ కలరింగ్ ఇస్తూనే.. 3 లేదా 4 గంటల ప్రాంతంలో సినిమాను వేసేస్తారు. కాని ఈసారి ''కాటమరాయుడు'' విషయంలో మాత్రం పోలీస్ పర్మిషన్ లేదంటూ బెనిఫిట్ షో క్యాన్సిల్ చేశారు. దానితో కాసేపు నిజాంపేట క్రాస్ రోడ్ దగ్గర్లోని భ్రమరాంభ ధియేటర్ దగ్గర ఫ్యాన్స్ రోడ్డుపై వీరంగం ఆడేశారు. పోలీసులు లాఠీలు పుచ్చుకుని స్వల్పంగా ఛార్జ్ చేస్తే కాని సిట్యుయేషన్ అదుపులోకి రాలేదు.

ఇకపోతే ఏలూరు వంటి టౌన్లలో రాత్రి 12 గంటలకు బెనిఫిట్ షో వేసేశారు. ఏలూరులోని సాయి బాలాజీ ధియేటర్ కాంప్లెక్స్ వద్ద దాదాపు పశ్చిమగోదావరి జిల్లాలోని పెద్దలందరూ క్యూ కట్టేశారనుకోండి!!

Full View
Tags:    

Similar News