కికి కేక అంటున్న సెలబ్రిటీస్!

Update: 2018-07-29 09:55 GMT
పూనమ్ పాండే - అదా శర్మ, - బాహుబలి ఐటెం గర్ల్ నారా ఫతేహి - కరిష్మా శర్మ.. ఇలా ఈ లిస్టు లో కామన్ గా ఉండేదేంటి?  అందరూ బ్యూటీలే లాంటి కామన్ సమాధానం కాకుండా కొత్తగా చెప్తే 'కికి ఛాలెంజ్'.   వీళ్ళందరూ గ్లోబ్ ను ఊపేస్తున్న కికి ఛాలెంజ్ కు స్పందించి కెనడియన్ ర్యాపర్ డ్రేక్  'ఇన్ మై ఫీలింగ్స్' పాటకు 'కికి డు యు లవ్ మీ' అంటూ రెచ్చిపోయి డ్యాన్సు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు.

మరి ఇంతటితో ఇది ఆగుతుందా అంటే ఇప్పుడే చెప్పలేం.  మూవింగ్ కార్ నుండి దిగి డాన్స్ చేసి తిరిగి  కారే ఎక్కే ప్రయత్నంలో కొంతమందికి ఇప్పటికే యాక్సిడెంట్లు కూడా అయ్యాయట.  దీంతో స్పెయిన్ - దుబాయ్ పోలీసులు ఇప్పటికే ఈ కికి  ఛాలెంజ్ ను బ్యాన్ చేయడం జరిగింది.. అక్కడెక్కడో  కాదు ముంబై లో కూడా పోలీసులు ఈ కికి ఛాలెంజ్ ను పబ్లిక్ లో చెయ్యొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

ఎన్ని చెప్పినా కికి ఛాలెంజ్ కు స్పందించి కారు దిగి డాన్స్ వేస్తూ 'కికి డు యు లవ్ మీ' అనే సెలబ్రిటిల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  చూస్తుంటే సెలబ్రిటీ సమాజం కిక్కునొదిలేసి కికి ని తగులుకున్నట్టుగా లేదూ...?
Read more!

వీడియో 1 కోసం క్లిక్ చేయండి

వీడియో 2 కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News