దేవ‌తా సుంద‌రికి తిట్లు చీవాట్లు ఏంటో!

Update: 2019-06-09 07:08 GMT
ష‌ల్ మీడియా పుణ్య‌మా అని తిట్లు- చీవాట్ల‌కు కొద‌వేం లేదు. అందుకోసం ఓ స్పెష‌ల్ ప్లాట్ ఫాం దొరికింద‌ని నెటిజ‌నులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా త‌మ‌కు న‌చ్చ‌ని వాళ్ల‌ను.. న‌చ్చిన వాళ్ల‌ను క‌లిపి తెగ తిట్టేస్తున్నారు. ఛాన్స్ దొరికితే తిత్తి తీస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు అందాల క‌థానాయిక‌లు సోష‌ల్ మీడియా ట్రోల్స్ కి బ‌లైపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇదే బాపతులో బెబో క‌రీనా క‌పూర్ సైతం తిట్లు- చీవాట్లు తినాల్సి రావ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది.

సీనియ‌ర్ భామ‌ల్లో బెబో క‌రీనా క‌పూర్ ఓవైపు వ్య‌క్తిగ‌త జీవితాన్ని.. మ‌రోవైపు వృత్తిగ‌త జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్ డ్ గా న‌డిపిస్తూ సాటి నాయిక‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. భ‌ర్త‌- పిల్ల‌లతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న‌ ఏకైక తార‌గా క‌రీనాకి పేరుంది. ఇక తైమూర్ అలీఖాన్ త‌ల్లిగా క‌రీనా నిరంత‌రం ఎంతో కేరింగ్ తో ఉండ‌డం చూస్తున్న‌దే. అయితే క‌రీనా విదేశీ (ట‌స్క‌నీ) వెకేష‌న్ కి సంబంధించిన ఓ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లోకి వ‌చ్చింది. ఈ ఫోటోలో బెబో లుక్ పై తీవ్ర‌మైన ట్రోలింగ్స్ తో నెటిజ‌నులు విరుచుకుప‌డ్డారు.

క‌రీనా మ్యానేజ‌ర్ పూన‌మ్ ద‌మానియా ఈ ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోకి `స‌న్ కిస్ డ్ బెబో .. మిస్ యూ` అంటూ వ్యాఖ్య‌ను జోడించారు. ఇందులో క‌రీనా ఎలాంటి మేక‌ప్ లేకుండా ఒరిజిన‌ల్ గెట‌ప్ తో క‌నిపించి స‌ర్ ప్రైజ్ ని ఇచ్చారు. అయితే ఈ ఫోటో చూడ‌గానే `క‌రీనా ఓల్డ్` అంటూ ఫ్యాన్స్ తీవ్రమైన‌ కామెంట్లు చేస్తున్నారు. ``రియ‌ల్ స్కిన్.. మ‌రీ వృద్ధురాలిలా క‌నిపిస్తోంది` అంటూ ఘాటైన వ్యాఖ్య‌ను చేశాడో ఓ నెటిజ‌న్. 38 ఏళ్ల క‌రీనా త‌న వ‌య‌సును మించి ఓల్డ్ గా క‌నిపిస్తోంద‌ని వేరొక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. `హెయిరీ ఆర్మ్ పిట్` అంటూ నేస్టీ కామెంట్ ని చేశాడో నెటిజ‌న్.
 
వాస్త‌వానికి బెబో క‌రీనా - సైఫ్ జోడీ సోష‌ల్ మీడియాకి బ‌హుదూరం. త‌న మ్యానేజ‌ర్ చేసిన ప‌నికి తాను తిట్లు తినాల్సొస్తోందిలా. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ క‌రీనా స్పందించ‌లేదు. బెబో కెరీర్ ని ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం `గుడ్ న్యూస్` అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ కుమార్ - దిల్జీత్ దోసాంజి- కియ‌రా అద్వాణీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.


Tags:    

Similar News