ప్రశాంత వదనంతో కరీనా.. ఆకర్షిస్తున్న ‘మెట‌ర్నిటీ ఫ్యాషన్’ !

Update: 2021-02-08 09:45 GMT
త‌ల్లికావ‌డం అనేది ప్ర‌తీ స్త్రీ జీవితంలో అత్యున్న‌త‌మైన అంశం. ఎదుగుతున్న త‌న గ‌ర్భాన్ని చూసి ఎంత‌గానో ఆనందించే స‌మ‌యం కూడా ఇదే. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ క‌రీనా క‌పూర్‌.. తన రెండవ బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ స‌మ‌యంలోనూ ‘మెట‌ర్నిటీ ఫ్యాషన్’ ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటోందీ బీటౌన్ బ్యూటీ.

రెండు రోజుల క్రితం కరీనా ‘కఫ్తాన్’ ధరించింది. ఆ డ్రెస్ తోపాటు ఆమె ముఖంలో వచ్చిన ప్రెగ్నెన్సీ గ్లో ఎంతో ప్రకాశవంతంగా కనిపించాయి. ఈ డ్రస్ ఆమె క్లాస్సి స్టైల్ ను కంటిన్యూ చేయడంతోపాటు.. ఆమెను ఎంతో సౌకర్యవంతంగా ఉంచింది.

ఇక, మరో సందర్భంలో మోనోక్రోమ్ బాడీకాన్ ధరించింది బెబో. రెగ్యులర్ గా కాకుండా.. కేవలం ప్రెగ్నెన్సీ టైంలోనే యూజ్ చేసే ఈ వస్త్రధారణలో నడుముకున్న బెల్ట్ ప్రత్యేక ఆకర్షణ! సాధార‌ణంగా గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఎవ‌రూ బెల్టును ధ‌రించ‌రు. అయితే.. ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన ఈ ఫాబ్రిక్ శ్వాస ప్ర‌క్రియను స‌జావుగా సాగేలా చూస్తుంది. లోపల శిశువు కూడా సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.

వీటితోపాటు మ‌రో చిత్రంలో మాక్సి ప్లీటెడ్ గౌనుతో క‌నిపించింది క‌రీనా. అంతేకాదు.. ఈ డ్రెస్ తో ముంబై వీధుల్లో ప‌చార్లు కూడా చేసింది. ఈ డ్రెస్ ఫ్రీగా మూవ్ అయ్యేందుకు ఎంతో స‌హ‌క‌రిస్తుంది. ఈ డ్రెస్ ధ‌రించిన బెబో చాలా అందంగా కూడా క‌నిపించింది.

ఇంకా.. త‌న ప్రెగ్నెన్సీ బంప్ ను బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లోనూ ప్ర‌ద‌ర్శించిందీ అమ్మ‌డు. ఎంతో స్మూత్ గా ఉండే  హై పోనీటైల్ తో త‌న‌దైన బ్యూటీని ఎలివేట్ చేసింది క‌రీనా. వీటితోపాటు ధ‌రించిన నెక్ పీస్ కూడా ఎంతో హుందాగా క‌నిపించింది.

మొత్తానికి.. త‌న మెట‌ర్నిటీ ఫ్యాష‌న్ ద్వారా త‌న ప్రెగ్నెన్సీ కండీష‌న్ తోపాటు గ్లామ‌ర్ ను కూడా ఏక‌కాలంలో ప్ర‌ద‌ర్శించింది బెబో. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో మ‌హిళ‌లు ఎంతో పీస్ ఫుల్ గా ఉండాలి. అప్పుడే పుట్ట‌బోయే బిడ్డ‌కు చాలా మంచిది. ఈ విష‌యాన్ని ఖ‌చ్చితంగా పాటిస్తున్న క‌రీనా.. ప్ర‌శాంత వ‌ద‌నంతో క‌నిపించింది. అదే స‌మ‌యంలో త‌నలోని ఫ్యాష‌న్ బ్యూటీని కూడా సాటిస్ఫై చేసింది.
Tags:    

Similar News