10కోట్ల క్ల‌బ్‌ లో మిర్చి మ్యాన్‌

Update: 2015-10-30 05:55 GMT
ఓవ‌ర్‌ నైట్‌ లో ఫేట్ మారిపోవ‌డం అంటే అదే. త్రివిక్ర‌మ్‌ - వినాయ‌క్ వంటి వారికే వెంట‌నే సాధ్యం కానిది... రెండో సినిమాతోనే కొర‌టాల సుసాధ్యం చేసుకున్నాడు. ఓ డైరెక్ట‌ర్‌కి 10 కోట్ల పారితోషికం ముట్ట‌జెప్ప‌డం అంటే ఆషామాషీనా. కేవ‌లం రెండు సినిమాల‌తోనే 10 కోట్ల క్ల‌బ్‌ లో చేరిన ద‌ర్శ‌కుడిగా కొర‌టాల శివ పేరు మార్మోగిపోతోంది. ప్ర‌స్తుతం అత‌డు తెర‌కెక్కిస్తున్న మైత్రి మూవీస్ చిత్రానికి అత‌డు అందుకుంటున్న పారితోషికం అక్ష‌రాలా ప‌ది కోట్ల రూపాయ‌లు అని చెబుతున్నారు.

త్రివిక్ర‌మ్ అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ 10 కోట్ల క్ల‌బ్‌ లో చేర‌డానికి జులాయి సినిమా వ‌ర‌కూ వేచి చూడాల్సొచ్చింది. శ్రీ‌నువైట్ల కి దూకుడు త‌ర్వాత కానా అంత‌టి స్టామినా రాలేదు. వి.వి.వినాయ‌క్‌ - రాజ‌మౌళికి కూడా రెండు కంటే ఎక్కువ సినిమాలు తీశాకే అంత పెద్ద మొత్తం ముట్టింది. కానీ మిర్చి - ఆ త‌ర్వాత శ్రీ‌మంతుడు రెండే రెండు సినిమాలతో బ్లాక్‌ బ‌స్ట‌ర్లు కొట్టి 10కోట్ల క్ల‌బ్ ద‌ర్శ‌కుడిగా పాపుల‌ర్ అయిపోతున్నాడు కొర‌టాల‌. ప్ర‌తిభ‌కు ప‌ట్టంగ‌ట్ట‌డం అంటే ఇదే మ‌రి.

శ్రీ‌నువైట్ల‌లోని కామెడీ సెటైర్‌ - త్రివిక్ర‌మ్‌ లోని మేధోత‌నం కొర‌టాల‌కు ఉన్నాయి. ఆమాత్రం ఇస్తే త‌ప్పేంటి? అనేవాళ్లున్నారు. అలాగే కొర‌టాల ఇక మూడో సినిమాతో హిట్టు కొడితే ఆ త‌ర్వాత లాభాల్లోంచి షేర్ రూపంలో మొత్తం 15 కోట్ల క్ల‌బ్‌ లోకి చేరిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని అంటున్నారు. వెయిట్ అండ్ సీ
Tags:    

Similar News