కొట్టుకుంటున్న హీరోయిన్-డైరెక్టర్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఏకంగా వ్యక్తిగతంగా మాటలు అనుకునేంత వరకూ స్టోరీ వచ్చేసింది. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు హద్దులు దాటిపోతోంది.
"నెపోటిజం(బంధుప్రీతి)కు ఫ్లాగ్ బేరర్" అంటూ కరణ్ జోహార్ పై నేరుగానే ఆరోపణ చేసింది కంగనా రనౌత్. అంతే కాదు మూవీ మాఫియా నడుపుతున్నాడని అర్ధం వచ్చే కామెంట్స్ కూడా చేసింది. ఆ కార్యక్రమంలో ఆ ఎపిసోడ్ ను అలాగే ఉంచి యథాతథంగా టెలికాస్ట్ చేసేశాడు. దీంతో కంగనా చేసిన ఆరోపణలను కరణ్ అంగీకరించాడా అనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన కరణ్ జోహార్.. "అసలు కంగనాకు నెపోటిజం అర్ధం తెలీదనుకుంటా. ఆమెను ఇక్కడ ఉండిపోమని ఎవరూ అడగడం లేదు. ఇష్టం వచ్చిన చోటకు వెళ్లచ్చు"అంటూ సీరియస్ గా స్పందించాడు. అంతే కాదు.. చీటికి మాటికీ "మహిళ", "విక్టిం" కార్డులను ఉపయోగంచడాన్ని కూడా ప్రస్తావించాడు.
దీనికి కంగనా కూడా ఏ మాత్రం తగ్గలేదు. "నేను ఎక్కడుండాలో ఆయన చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీ ఏమీ వాళ్ల నాన్న ఆయనకు రాసిచ్చిన ఆస్తి కాదు. నేను బ్యాడ్ యాస్ కార్డ్ కూడా ఉపయోగించా. ఆయన కూతురుకు కరణ్ 'మహిళా కార్డు' 'విక్టిం కార్డ్' 'బ్యాడ్ యాస్ కార్డు'లలో ఏదైనా ఇవ్వచ్చు. ఇష్టం వచ్చినది వాడుకోమని చెప్పచ్చు" అంటూ వ్యాఖ్యానించింది. తాజాగా కరణ్ ఇద్దరు కవల పిల్లలకు సింగిల్ ఫాదర్ గా మారిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/