బాలీవుడ్ వెళ్లిపోతున్న ప్రభాస్!?
బాహుబలి2 మూవీ సాధించిన సక్సెస్ అలాంటి ఇలాంటిది కాదు. ఇండియన్ మూవీ సత్తా చాటి చెప్పిన సినిమా ఇది. బాహుబలి సిరీస్ తర్వాత యూత్ తో పాటు ఫిమేల్ ఆడియన్స్ లోను.. మాస్ లోను ప్రభాస్ కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది.
ప్రభాస్ కు ఏర్పడ్డ ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాత కరణ్ జోహార్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ప్రభాస్ తో రెండు సినిమాల డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ తో పలుమార్లు చర్చలు కూడా జరిపాడట. అయితే.. ఇవన్నీ ఫోన్ సంభాషణలు మాత్రమే. వచ్చే నెలలో ప్రభాస్ ముంబై వెళ్లబోతున్నాడని.. దీని ప్రధాన ఉద్దేశ్యం బాలీవుడ్ మూవీ డీల్ ఫైనలైజ్ చేసుకోవడమేనని తెలుస్తోంది. ప్రభాస్ కు సన్నిహితులు కూడా కరణ్ జోహార్ తో డీల్ విషయంపై సానుకూలంగానే రియాక్ట్ అవుతున్నారు.
కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. అది ప్రభాస్ కు ఎంతో మేలు చేసే విషయంగా చెబుతున్నారు. అయితే.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రభాస్ ఓకే చెప్పినా.. ఇది ఇప్పటిలో కాదని.. ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టచ్చని తెలుస్తోంది.