14 మంది ప‌రిచ‌యం.. ధ‌ర్మాధినేత‌ త‌న‌పై అప‌ప్ర‌ద‌కు ఇలా చెక్!

Update: 2021-03-05 09:30 GMT
న‌ట‌వార‌సుల్ని ప‌రిచ‌యం చేస్తూ బాలీవుడ్ మాఫియాకి అండ‌గా నిలుస్తున్నాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొంటున్నారు ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్. ఈ విష‌యంలో ప్ర‌తిసారీ అతడిపై కంగ‌న ర‌నౌత్ దెప్పి పొడుపులు మీడియా హెడ్ లైన్స్ లో హైలైట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానంత‌రం ఇది మ‌రింత పెద్ద‌గా డిబేట్ కి తెర తీసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌నులు క‌ర‌ణ్ వైఖ‌రిని తూర్పార‌బ‌డుతూ సుశాంత్ సింగ్ మ‌ర‌ణానికి అత‌డు వాంగ్మూలం ఇవ్వాల‌ని కోర‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌ర‌ణ్ కొన్నాళ్ల పాటు మీడియాకి దూరంగా ఎలాంటి హంగామా లేకుండా గ‌డ‌పాల్సొచ్చిందంటే సీన్ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఆయ‌న త‌న‌పై ప‌డిన అప‌ప్ర‌ద‌ను చెరిపేసుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నార‌నే తాజా ప్ర‌య‌త్నం చెబుతోంది. లేటెస్టుగా ఆయ‌న‌ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరో 14 మంది దర్శకులను పరిశ్రమకు పరిచయం చేస్తున్నామ‌ని ప్రకటించారు. ధ‌ర్మ సంస్థ నాలుగు ద‌శాబ్ధాల చ‌రిత్ర‌ను క‌లిగి ఉంది. ఆ క్ర‌మంలోనే ఆయ‌న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది.

ఒకేసారి 14 పేర్లను ప్రకటించి ధ‌ర్మాధినేత అగ్గి రాజేసారు. మొత్తం 14 మంది దర్శకుల వీడియోను పంచుకుంటూ కరణ్ ట్వీట్ చేసారు. గత నాలుగు దశాబ్దాలుగా... ధర్మప్రొడక్షన్స్ పెద్ద తెరపై మ్యాజిక్ చేస్తోంది. దానికోసం సంవత్సరాలుగా 20 మందికి పైగా దర్శకులను ప‌రిచ‌యం చేసింది. వారి నైపుణ్యాల్ని మెరుగుప‌రిచేందుకు మేం కృషి చేశాం. ఇప్పుడు టీమ్ ధర్మ అంతా సిద్ధంగా ఉంది. నేటి కొత్త యుగంలో 14 మంది యువ ప్రతిభావంతులైన కథకులు ధర్మ కుటుంబంలో చేరారు`` అని ఎంతో ఉద్విగ్న‌త‌తో వెల్ల‌డించారు క‌ర‌ణ్‌.

``సినిమాపై న‌వ‌త‌రం ఆధునిక దృక్పథం మాధ్యమాలలో వ్యాపించే కంటెంట్ కొత్త శకాన్ని తెస్తుంది. థియేట్రికల్ లేదా డిజిటల్ వేదిక ఏది అయినా.. మా కొత్త కథకులు అందుకు సిద్ధంగా ఉన్నారు. ధర్మ సంస్థ డైరెక్ట‌ర్లు వారి వంటగదిలో చాలా కథలు తయారుచేస్తున్నారు. వారు టేబుల్ ‌మీద‌కు ఏం తీసుకువస్తారో చూసేవ‌ర‌కూ నేను ఆగ‌లేను. మీరంతా వేచి ఉండండి`` అని అన్నారు.

ఇంత‌మంది ద‌ర్శ‌కుల్ని త‌న సంస్థ ద్వారా ప‌రిచయం చేస్తున్నారు. అలాగే ప్ర‌తి సినిమాకి కొత్త త‌రం న‌టీన‌టుల్ని ప‌రిచ‌యం చేయ‌డం క‌ర‌ణ్ కి అల‌వాటు. వారంతా ఇండ‌స్ట్రీ ఇన్ సైడ‌ర్స్.. ఔట్ సైడ‌ర్స్ అని విడ‌దీయ‌డం క‌ష్ట‌మైన వ్య‌వ‌హార‌మే. అందుకే నెమ్మ‌దిగా ధ‌ర్మాధినేత త‌న‌పై ప‌డిన అప‌వాదును చెరిపేసుకుందుకు ఆస్కారం క‌లుగుతోంద‌ని అంతా భావిస్తున్నారు. అందులో భాగంగానే 14 మంది ద‌ర్శ‌కుల‌ను గంప‌గుత్త‌గా ఒకేసారి ప‌రిచ‌యం చేశార‌న్న టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News