కరణ్‌ మొదటి శృంగార అనుభవం...!

Update: 2018-09-01 17:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌. ఈయన బ్యానర్‌ లో చిత్రాలు చేయాలని చిన్నా - పెద్దా హీరోలు కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎంతో మంది స్టార్స్‌ ను బాలీవుడ్‌ కు పరిచయం చేసిన 45 ఏళ్ల కరణ్‌ జోహార్‌ ఏ విషయంలో అయినా మొహమాటం లేకుండా మాట్లాడేస్తాడు. పెళ్లిపై ఆసక్తి లేని ఇతగాడు ఇటీవలే సరోగస్సీ ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. పెళ్లికి సెక్స్‌ కు సంబంధం లేదని - సెక్స్‌ కోసమే పెళ్లి అనుకోవడం తప్పని చెబుతూ ఉండే కరణ్‌ జోహార్‌ తాజాగా తన మొదటి సెక్స్‌ అనుభవంను మీడియా ముందు చెప్పుకొచ్చాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కరణ్‌ జోహార్‌ తన సెక్స్‌ అనుభవా గురించి - తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే తాను 26 ఏళ్ల వయస్సులో మొదటి సారి సెక్స్‌ అనుభవంను చవి చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. తన మొదటి సెక్స్‌ అనుభవం ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదని, డబ్బులిచ్చి సంతృప్తిని పొందాలని ప్రయత్నించిన తాను విఫలం అయ్యాను అని, ఆ తర్వాత వారం రోజులకు మరోసారి ప్రయత్నించినా కూడా విఫలం అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ సమయంలోనే డబ్బులిచ్చి సెక్స్‌ చేయడం అనేది చాలా పెద్ద చెత్త పని అని - డబ్బులిస్తే ఆమె కృత్రిమమైన ప్రేమను మాత్రమే చూపుతుందని - అలాంటి సమయంలో సెక్స్‌ అనేది సంతృప్తికరంగా సాగదు అనేది తన అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు. డబ్బు పెట్టి సెక్స్‌ సుఖంను కొనుగోలు చేయాలని భావించడం బుద్దితక్కువ పని అనేది తన అభిప్రాయం అని, తాను ఎవరితో అయితే సెక్స్‌ కోరుకుంటానో వారితో కొంత కాలం డేటింగ్‌ చేసి - ఆమెతో సన్నిహితంగా ఉంటాను. సెక్స్‌ కోసం తాను ఎప్పుడు కూడా ఎక్కువగా ఖర్చు చేయను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత బోల్డ్‌ గా కరణ్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో రకరకాలుగా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News