రాజమౌళి గురించి కరణ్ ఏమన్నాడో చూడండి

Update: 2017-04-29 09:59 GMT
ఏ రకంగా చూసినా ‘బాహుబలి’ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎవర్ మూవీ అనడంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. బడ్జెట్.. రిలీజ్ స్కేల్.. వసూళ్లు.. ఇలా దేన్ని ప్రామాణికంగా తీసుకున్నా ‘బాహుబలి’ ముందు మిగతా సినిమాలన్నీ దిగదుడుపే. ఇలాంటి సినిమా తీశాడు కాబట్టి ఇండియాలో రాజమౌళిని మించిన డైరెక్టర్ లేడంటూ పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశాడు కరణ్ జోహార్. ‘బాహుబలి’ రెండు భాగాల్ని హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్.. రెండేళ్ల ముందు నుంచి రాజమౌళి గురించి గొప్పగా చెబుతున్నాడు. గత నెలలో ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా రాజమౌళిని ‘మొఘల్ ఎ అజామ్’ తీసిన లెజెండరీ డైరెక్టర్ ఆసిఫ్ తో పోల్చాడు కరణ్. ఇప్పుడు ఏకంగా ఈ తరంలో రాజమౌళి మించిన దర్శకుడు లేదని తీర్మానించేశాడు.

‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదల నేపథ్యంలో రాజమౌళితో దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన కరణ్.. రాజమౌళిని ‘మ్యాన్ ఆఫ్ ద డెకేడ్’గా అభివర్ణించాడు. రాజమౌళి లాంటి మేధావితో కలిసి పని చేసినందుకు గర్వంగా ఉందని.. కచ్చితంగా ఈ తరంలో రాజమౌళే అత్యుత్తమ దర్శకుడని తేల్చేశాడు కరణ్. ఐతే బాలీవుడ్లో రాజ్ కుమార్ హిరాని.. దక్షిణాదిన మణిరత్నం, శంకర్ లాంటి దర్శకులుండగా రాజమౌళే అత్యుత్తమం అని తీర్మానించేడయం కొందరికి రుచించకపోవచ్చు. ‘బాహుబలి’ని తాను రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి కరణ్ కొంచెం అతి చేస్తున్నాడంటూ వేరే ఇండస్ట్రీల వాళ్లు విమర్శిస్తున్నారు. ‘వన్ ఆఫ్ ద బెస్ట్’ అంటే బాగుండేదని.. ‘ది బెస్ట్’ అని రాజమౌళికి కితాబివ్వడం కొంచెం టూమచ్చే అని కొందరు అభిప్రాయపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News