స‌ల్మాన్ త‌ర్వాత మాఫియా లిస్ట్ లో క‌ర‌ణ్?

Update: 2022-06-19 07:30 GMT
బాలీవుడ్ ని మాఫియాతో ముడిపెట్ట‌కుండా చూడ‌లేం. ముంబై ప‌రిశ్ర‌మ‌కు దావూద్ తో పాటు చోటా ష‌కీల్ అండ్ గ్యాంగ్స్ ఏనాడో టార్గెట్ చేశాయి. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌తో స‌త్సంబంధాల‌ను మాఫియా కొన‌సాగించింది. అయితే దీనికి భిన్నంగా పంజాబీ డాన్ లు ఏకంగా కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేశారు. కృష్ణ జింక‌ల వేట స‌ల్మాన్ ని ఇప్ప‌టికీ వ‌దిలి పెట్ట‌డం లేదు. అత‌డు కోర్టుకు వెళ్లిన ప్ర‌తిసారీ లారెన్స్ బిష్ణోయ్ అనే డాన్ నుంచి బెదిరింపులు  ఎదుర్కొంటున్నాడు. ఇటీవ‌ల లారెన్స్ ముఠా బెదిరింపుల‌తో స‌ల్మాన్ కుటుంబానికి పోలీస్ కాప‌లా పెరిగింది. ఇది కేవ‌లం స‌ల్మాన్ వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. ఇప్పుడు ఇదే ముఠా లిస్ట్ లో ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ పేరు చేరింది.

లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు సిద్ధేష్ కాంబ్లే అలియాస్ మహాకల్ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ని దోపిడీ చేసేందుకు ప్లాన్ చేశార‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ గ్యాంగ్ లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తుల జాబితాలో క‌ర‌ణ్ కూడా ఉన్నారని పరిశోధకులకు తెలిపినట్లు పోలీసు అధికారి ఒక‌రు వెల్ల‌డించార‌ని జాతీయ మీడియా తెలిపింది. అయితే ఈ వాదనలు ఇంకా అధికారికం గా ధృవీకరించలేమ‌ని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు అన్నారని చెబుతున్నారు.

కాంబ్లే పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అనుమానిత షూటర్ సంతోష్ జాదవ్ కు సన్నిహితుడు. హత్యల‌కు కుట్ర ఎలా ప‌న్నాలో బాగా తెలిసిన వాడ‌ని పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. గతంలో జిల్లాలో నమోదైన కేసులో కాంబ్లే పూణె రూరల్ పోలీసుల కస్టడీలో ఉండగా.. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్... పంజాబ్ పోలీసులు .. ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందాలు మూసేవాలా హత్య పైనా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ కు వచ్చిన బెదిరింపు లేఖకు సంబంధించి అతనిని ప్రశ్నించాయి. ఖాన్ - అతని తండ్రి సలీం ఖాన్ కి బెదిరింపుల అనంత‌రం... ఈ నెల ప్రారంభంలో వాంగ్మూలాల్లో మూసేవాలా హత్య కుట్ర గురించి కాంబ్లే చాలా సమాచారాన్ని వెల్లడించాడు.

సంతోష్ జాదవ్ .. నాగనాథ్ సూర్యవంశీ లు హత్య కుట్ర‌లో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు. అతను బిష్ణోయ్ గ్యాంగ్ భవిష్యత్ ప్రణాళికల గురించి కీల‌క‌ సమాచారాన్ని అందించాడు. ఇందులో మూసేవాలా హత్య వెనుక కీల‌క ఆధారాల‌ను క‌నుగొన్న‌ట్టు పోలీస్ అధికారి తెలిపారు.

క‌ర‌ణ్ జోహార్ ను బెదిరించి రూ.5 కోట్లు దోపిడీ చేయాలని ముఠా ప్లాన్‌ చేసిందని తెలిపారు. కాంబ్లే వెల్ల‌డించిన వివ‌రాల‌ ప్రకారం.. కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ సోదరుడు విక్రమ్ బ్రార్ ఈ ప్లాన్ ల గురించి ఇన్ స్టాగ్రామ్ .. సిగ్నల్ యాప్ లలో అతనితో చర్చించారు. క‌ర‌ణ్ తో పాటు.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న ఒక మహిళ.. సిక్కు కమ్యూనిటీ పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేసిన వైద్యుడు కూడా టార్గెట్ జాబితాలో ఉన్నారని అధికారి తెలిపారు. దర్యాప్తు సంస్థలు కాంబ్లే వాదనలను ఇప్పటికీ ధృవీకరిస్తున్నాయని ఆయన తెలిపారని జాతీయ మీడియాలు క‌థ‌నాల్ని వెలువ‌రించ‌డం సంచ‌ల‌న‌మైంది.
Tags:    

Similar News