ఈయన జాకెట్‌ ఖరీదు ఎంతో తెలుసా?

Update: 2020-06-14 08:22 GMT
బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ బ్రాండ్స్‌ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారనే టాక్‌ ఉంది. ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్‌ చాలా ట్రెండీగా అప్‌ డేటెడ్‌ గా ఉంటాయి. చాలా మోడ్రన్‌ డ్రస్‌ లను వేసుకునే కరణ్‌ జోహార్‌ గతంలో పలు సార్లు తన డ్రస్‌ ల వల్ల వార్తల్లో నిలిచాడు. మరోసారి ఆయన వేసుకున్న డ్రస్‌ కారణంగా మీడియాలో నిలిచాడు. ముఖ్యంగా ఆయన ధరించిన బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ కలర్‌ జాకెట్‌ ఖరీదు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

కరణ్‌ జోహార్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించినప్పుడు లేదంటే ఏదైనా పబ్లిక్‌ ఈవెంట్స్‌ కు వెళ్లిన సమయంలో ఇలాంటి ఖరీదైన జాకెట్స్‌ వేసుకుంటూ ఉంటాడు. గతంలో కూడా ఇలాంటివి ఆయన ధరించాడు. అయితే ఈసారి కరణ్‌ జోహార్‌ వేసుకున్న జాకెట్‌ ఖరీదు దాదాపుగా రెండు లక్షల రూపాయలుగా చెబుతున్నారు. కేవలం జాకెట్‌ కు అంతటి రేటు అంటే అంతా నోరు వెళ్లబెట్టాల్సిందే. ఇక పూర్తి డ్రస్‌ ఖరీదు తీసుకుంటే మూడు లక్షల వరకు ఉంటుందని కాస్ట్యూమ్స్‌ డిజైనర్స్‌ అంటున్నారు. వందల కోట్లతో సినిమాలు నిర్మించే కరణ్‌ జోహార్‌ లక్షల్లో డ్రస్‌ లు మెయింటెన్‌ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు.
Tags:    

Similar News