స్టార్ ఫిల్మ్ మేకర్ వ్యాఖ్యలతో అంతా గరంగరం
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తాజాగా కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ 2 గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆయన కేజీఎఫ్ 2 ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేస్తే పర్వాలేదు.. కాని బాలీవుడ్ కు చెందిన ఫిల్మ్ మేకర్స్ ను చిన్న చూపు చూసే విధంగా వ్యాఖ్యలు చేశాడు. దాంతో స్వయంగా బాలీవుడ్ మీడియా ఆయనపై గరం గరం కథనాలు అల్లుతూ ఆయన్ని విమర్శిస్తూ ఉంది.
ఇంతకు ఆయన ఏమన్నాడంటే.. సౌత్ ఫిల్మ్ మేకర్స్ కథల ఎంపిక విషయంలో రాజీ పడటం లేదు. ఎంపిక చేసుకున్న కథ ను మరియు తెరకెక్కించే విధానంను వారు చాలా నమ్ముతున్నారు. అది ఈమద్య కాలంలో బాలీవుడ్ లో కనిపించడం లేదు. కథల ఎంపిక విషయం మొదలుకుని పలు విషయాల్లో బాలీవుడ్ మేకర్స్ లో నమ్మకం కనిపించడం లేదు అంటూ కరణ్ పేర్కొన్నాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది దర్శకులు కథ ను అనుకున్నది అనుకున్నట్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సక్సెస్ అవుతున్నారు. ఇటీవలే నేను కేజీఎఫ్ 2 చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఒక వేళ కేజీఎఫ్ 2 ను బాలీవుడ్ లో తీసి ఉంటే ఖచ్చితంగా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ విమర్శలతో సినిమాపై నమ్మకం కోల్పోయేలా చేసేవారు అన్నాడు.
కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలను ఉత్తరాది మీడియా వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. మీరు తీస్తున్న సినిమాలు బాగుంటున్నాయని.. మేము వాటిని విమర్శిస్తున్నామా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరు చాలా కాలంగా కథల ఎంపిక విషయంలో పూర్తిగా గతి తప్పారు. మీరు ఇప్పుడు మీడియా గురించి మాట్లాడుతున్నారా అంటూ కొందరు సోషల్ మీడియాలో బాహాటంగానే కరణ్ జోహార్ ను కౌంటర్ చేస్తున్నారు.
ఇక కేజీఎఫ్ 2 విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో యశ్ మరియు శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ లు గా నటించారు. కేజీఎఫ్ 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసి ఎన్నో బాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డు లను కూడా బ్రేక్ చేసింది. దంగల్ వంటి స్ట్రాంగ్ వసూళ్ల రికార్డును కూడా బ్రేక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా షాక్ ఇచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులు కేజీఎఫ్ 2 ను ఎంతో బాగా ఆదరించారు. అదే విషయాన్ని కరణ్ జోహార్ తెలియజేశాడు.