ట్రైలర్ టాక్: సస్పెన్స్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా 'క‌ప‌ట‌ధారి'

Update: 2021-01-12 15:30 GMT
అక్కినేని హీరో సుమంత్‌ నటించిన లేటెస్ట్ ఎమోష‌న‌ల్ థ్రిల్లర్ మూవీ "క‌ప‌ట‌ధారి". ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్‌ పై ధనుంజయన్ నిర్మించాడు. ఇది కన్నడ హిట్ 'కావలధారి' సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఇప్పటికే 'క‌ప‌ట‌ధారి' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని అక్కినేని నాగచైతన్య - సమంత కలిసి విడుదల చేశారు.

'మెట్రో లైన్ తవ్వకాల్లో కొన్ని స్కెలేటిన్స్ బయటపడ్డాయి..' అంటూ సుమంత్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఒక హత్య కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని హీరో ఎలా పరిష్కరించాడు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందిందని అర్థం అవుతోంది. ఆసక్తిరేపే సంభాషణలు, సస్పెన్స్ కి గురిచేసే సన్నివేశాలతో 'కపటధారి' ట్రైలర్‌ ఉంది. 'క్రైమ్ అయినా ట్రాఫిక్ అయినా పోలీస్ పోలీసే..' అనే డైలాగ్ తో ఓ ట్రాఫిక్ కాప్ చేధించే కేసుకు సంబంధించిన స్టోరీ అని తెలుస్తోంది.

'క‌ప‌ట‌ధారి' చిత్రంలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. నాజర్ - జయప్రకాష్ - సుమన్ రంగనాథ్ - వెన్నెల కిషోర్ - సంపత్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సైమన్ కె.కింగ్ మ్యూజిక్ అందించగా.. రసమతి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌ గా వర్క్ చేసారు. ఈ చిత్రానికి  డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.Full View
Tags:    

Similar News