కంగనాకు మూడోసారి సమన్లు జారీ..!
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నిత్యం ఏదొక విధంగా వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా రనౌత్ బాలీవుడ్ పైన మరియు మహారాష్ట్రలో ఉన్న శివసేన ప్రభుత్వంపైనా అనేక ఆరోపణలు చేసింది. ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చడంతో ప్రారంభమైన కంగనా - శివసేన మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కంగనా బంగ్లా ని కూడా కూల్చారు. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శివసేన నాయకులపైనా విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ అనే పేరు సార్ధకం చేసుకుంటోంది. ఈ క్రమంలో కంగనా మీద అనేక కేసులు నమోదు చేయబడ్డాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మీద, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. రైతులను కించపరిచారని కంగనాపై కేసులు నమోదైనాయి. అలానే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని కంగనా మరియు ఆమె సోదరి రంగోళిపై ముంబైలో దేశద్రోహం కేసు నమోదు చేశారు.
మతఘర్షణలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడరనే ఆరోపణలతో అక్టోబర్ 26, 27 తేదీలలో హాజరుకావాలంటూ కంగనకు సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత నవంబర్ 9, 10 తేదీల్లో హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. రెండు సార్లు కంగనా మరియు ఆమె సోదరికి నోటీసులు జారీ వాళ్లు హాజరుకాలేదు. ఇంట్లో పెళ్లి ఉన్నందున హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా కంగనా - రంగోలీ చందేల్ లకు ముంబై పోలీసులు మూడోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఈనెల 23, 24వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఈసారైనా హాజరవుతారేమో చూడాలి.